Kirti Azad: కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. మమతా పార్టీ టీఎంసీలోకి మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్..
Kirti Azad To Join TMC: కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీహార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు
Kirti Azad To Join TMC: కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీహార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు సాయంత్రం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో కీర్తి ఆజాద్ టీఎంసీ తీర్థం పుచ్చుకోనున్నారు. కీర్తి ఆజాద్ చేరికతో టీఎంసీ పార్టీ మొట్టమొదటిసారిగా బీహార్‌లో అడుగుపెట్టనుంది. 2024 ఎన్నికల కోసం మమతా పార్టీ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో టీఎంసీని విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. 1983 క్రికెట్ వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో సభ్యుడైన కీర్తి ఆజాద్ బీహార్ రాష్ట్రంలోని దర్బంగా స్థానం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచారు. కీర్తి ఆజాద్.. బీహార్ మాజీ ముఖ్యమంతి భగత్ ఝా ఆజాద్ కుమారుడు.
కీర్తి ఆజాద్.. 2019 లోక్ సభ ఎన్నికల్లో ధన్‌బాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతకుముందు బీజేపీలో పనిచేసిన కీర్తి ఆజాద్ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌లో మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అక్రమాలకు పాల్పడ్డారంటూ బహిరంగంగా ఆరోపించారు. దీంతో బీజేపీ అతన్ని సస్పెండ్ చేసింది. ఆ తర్వాత కీర్తి ఆజాద్ కాంగ్రెస్ గూటికి చేరారు. కాగా.. కీర్తి ఆజాద్ తోపాటు కాంగ్రెస్ మాజీ నేత అశోక్ తన్వర్ కూడా టీఎంసీలో చేరతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
గతంలో హర్యానాలోని సిర్సా లోక్‌సభ నుంచి గెలిచిన అశోక్ తన్వర్ 2019లో అసెంబ్లీ ఎన్నికలకు రెండు వారాల ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత దుష్యంత్ చౌతాలా జేజేపీ పార్టీకి మద్దతు తెలిపి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కాగా.. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్ నేతలు కూడా టీఎంసీలో చేరుతుండటంతో ఢిల్లీ రాజకీయాలు ఆసక్తికరంగా మారియి.
Also Read: