కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఈసారి పార్లమెంట్ సమావేశాలు లేనట్లే.. భగ్గముంటున్న కాంగ్రెస్..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలను రద్దు చేసింది. ఈ మేరకు అధికారికంగా తెలిపింది.

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఈసారి పార్లమెంట్ సమావేశాలు లేనట్లే.. భగ్గముంటున్న కాంగ్రెస్..
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 16, 2020 | 7:13 AM

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలను రద్దు చేసింది. ఈ మేరకు అధికారికంగా తెలిపింది. పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషికి లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన మంత్రి.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరిలో సమావేశాలను జరపడంపై సమాలోచనలు చేస్తున్నామని పేర్కొన్నారు. చలికాలం నేపథ్యంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని, ముఖ్యంగా ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కవగా నమోదవుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. శీతాకాల సమావేశాలను వాయిదా వేయడంపై ఇప్పటికే అన్ని పార్టీలతో చర్చించినట్లు ఆయన తెలిపారు. మెజార్టీ సభ్యులు సభ వాయిదాకు అంగీకరించారని మంత్రి చెప్పుకొచ్చారు.

ఇదిలాఉండగా, కేంద్ర నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. తమను అసలు సంప్రదించలేదని ఆరోపించింది. కావాలనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలను రద్దు చేశారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పార్లమెంట్‌లో రైతుల ఆందోళనపై చర్చ నుంచి తప్పించుకోవడానికే ఎన్డీయే సర్కార్ తెలివిగా సమావేశాలను వాయిదా వేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఆరోపించారు. కరోనా నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేశామని చెప్తున్న ప్రభుత్వం.. పార్లమెంట్ కొత్త భవనానికి శంకుస్థాపనను ఎందుకు వాయిదా వేయలేదని ప్రశ్నించారు. అదేవిధంగా బిహార్ ఎన్నికలను వాయిదా వేశారా? అని ఆయన నిలదీశారు.

Also read:

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. హోంమంత్రి అమిత్‌షాతో పలు విషయాలపై మంతనాలు..