పేకాటకు బానిసై నీచానికి ఒడి గట్టిన భర్త.. ఆటలో ఓడిపోయిన ప్రతిసారి గెలిచిన వ్యక్తులతో..
పేకాటకు అలవాటు పడిన ఓ వ్యక్తి చాలా నీచానికి ఒడి గట్టాడు. డబ్బులు లేకపోవడంతో ఏకంగా తన భార్యనే పందెంగా పెట్టేవాడు.
పేకాటకు అలవాటు పడిన ఓ వ్యక్తి చాలా నీచానికి ఒడి గట్టాడు. డబ్బులు లేకపోవడంతో ఏకంగా తన భార్యనే పందెంగా పెట్టేవాడు. ఓడిపోయిన ప్రతిసారి గెలిచిన వారితో శృంగారం చేయాలని బలవంతం చేసేవాడు. ఓసారి నిరాకరించిందని అతి దారుణంగా యాసిడ్ పోశాడు. బిహార్‌లో జరిగిన ఈ ఘటన సభ్య సమాజాన్ని దలదించుకునేలా చేసింది. వివరాల్లోకి వెళితే..
బిహార్‌లోని భగల్‌పూర్‌కు చెందిన సోనూ హరిజన్ ఇటీవల కొంతమందితో పేకాట ఆడి ఓడిపోయాడు. వారితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నెలపాటు వారితోనే ఉండాలంటూ భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అప్పటికే బయటి వ్యక్తుల చేతుల్లో నరకం చూసిన ఆమె, వెళ్లేందుకు ససేమిరా అనడంతో యాసిడ్ పోశాడు. తర్వాత ఆమెను బంధించి నెల పైగానే గదిలో ఉంచాడు. ఎలాగో తప్పించుకొని ఆమె పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.