డబ్బు కోసం గ్రామ వాలంటీరైన భర్త బాబూరావుతో కలిసి అమ్మానాన్నలను హత్యచేసిన కూతురు మనీషా.. కృష్ణాజిల్లాలో దారుణం.!

కృష్ణాజిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్తతో కలసి కన్న తల్లి, తండ్రిని హత్య చేసింది కూతురు. జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో ఈ ఘటన వెలుగుచూసింది. జ..

డబ్బు కోసం గ్రామ వాలంటీరైన భర్త బాబూరావుతో కలిసి అమ్మానాన్నలను హత్యచేసిన కూతురు మనీషా.. కృష్ణాజిల్లాలో దారుణం.!
Venkata Narayana

|

Dec 16, 2020 | 8:36 AM

కృష్ణాజిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్తతో కలసి కన్న తల్లి, తండ్రిని హత్య చేసింది కూతురు. జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో ఈ ఘటన వెలుగుచూసింది. జగ్గయ్యపేటలో వాలంటీర్ గా భర్త బాబూరావు పనిచేస్తుండగా, సొంత తల్లిదండ్రులనే చంపేందుకు సహకరించింది కన్నకూతురైన మనీషా. బాబురావు – మనీషా మూడునెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. లక్ష రూపాయల నగదు కోసం నవదంపతులిద్దరూ సొంతవాళ్లనే హత్యలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇల్లు అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులపై మొగుడు బాబురావుతో కలసి గొడవ పడింది మనీషా. అమ్మానాన్నలు అందుకు ఒప్పుకోక పోవడంతో ఇద్దరి పీక కోసి చంపేశారీ కొత్త దంపతులు. అనంతరం ఇరువురు భార్యాభర్తలు పరారైపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కోట ముత్తయ్య, సుగుణమ్మగా పోలీసులు గుర్తించారు. జంట హత్యల నేపథ్యంలో బండిపాలెంలో గంభీరకరవాతావరణం నెలకొంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu