AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ సింగ‌ర్ సునీత రెండో పెళ్లి వాయిదా..! ఇరు కుటుంబ స‌భ్యుల నిర్ణ‌యం..కార‌ణం ఇదేనా..?

టాలీవుడ్ పాపుల‌ర్ సింగ‌ర్‌లో ఒక‌రైన సునీత సోష‌ల్ మీడియాలో ట్రైండింగ్ అయిపోయారు. ఆమె త్వ‌ర‌లో వివాహం చేసుకోబోతోంది. చాలా కాలంగా త‌న‌కు తెలిసిన వ్యాపార‌వేత్త రామ్ వీర‌ప‌నేనితో ....

టాలీవుడ్ సింగ‌ర్ సునీత రెండో పెళ్లి వాయిదా..! ఇరు కుటుంబ స‌భ్యుల నిర్ణ‌యం..కార‌ణం ఇదేనా..?
Anil kumar poka
|

Updated on: Dec 16, 2020 | 8:36 AM

Share

టాలీవుడ్ పాపుల‌ర్ సింగ‌ర్‌లో ఒక‌రైన సునీత సోష‌ల్ మీడియాలో ట్రైండింగ్ అయిపోయారు. ఆమె త్వ‌ర‌లో వివాహం చేసుకోబోతోంది. చాలా కాలంగా త‌న‌కు తెలిసిన వ్యాపార‌వేత్త రామ్ వీర‌ప‌నేనితో త్వ‌ర‌లోనే ఏడ‌డుగులు వేయ‌బోతున్నారు. మొద‌టి భ‌ర్త నుంచి విడాకులు తీసుకుని రెండో పెళ్లికి రెడీ అవుతున్నారు. కొన్ని రోజుల కింద‌ట రామ్ తో ఆమె నిశ్చితార్థం కూడా జ‌రిగిపోయింది. అయితే తాజాగా ఆమె పెళ్లి వాయిదా ప‌డిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సునీత‌-రామ్ వీర‌ప‌నేనితో హైద‌రాబాద్‌లో డిసెంబ‌ర్ 27న వివాహం జ‌ర‌బోతోంద‌ని వార్త‌లు వ‌చ్చినా.. అది వాయిదా ప‌డిన‌ట్లు స‌మాచారం.

వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల వీరి వివాహం వాయిదా ప‌డింద‌ని, రాబోయే సంవ‌త్స‌రంలో వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వాయిదా ప‌డ‌డానికి కార‌ణాలేమి తెలియ‌క‌పోయినా.. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మంచి ముహూర్తం చూసి పెళ్లి జ‌రిపించాల‌ని ఇరు కుటుంబ స‌భ్యులు నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

సునీత సింగ‌ర్‌గా, యాంక‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్నారు. గ‌తంలో ప‌లు ఇంట‌ర్వ్యూల్లో రెండో పెళ్లి చేసుకోన‌ని చెప్పిన సునీత ఇప్పుడు పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ఇదిలా ఉండ‌గా, సునీత‌కు 19 ఏళ్ల వ‌య‌సులోనే వివాహం జ‌రిగింది. కిర‌ణ్ కుమార్ అనే వ్య‌క్తిని పెళ్లాడారు. కొన్నాళ్ల కాపురం త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో వీరిద్దరూ విడిపోయారు. ఇప్ప‌టికే వీరికి ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. ఇప్పుడు వాళ్లు పెరిగి పెద్ద‌య్యారు. వారి కోరిక మేర‌కు 43 ఏళ్ల వ‌య‌సులో ఉన్న సునీత రెండో పెళ్లి చేసుకునేందుకు అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్