భారత్ – బ్రిటన్ టాక్స్…. 5 అంశాల్లో పరస్పర సహకారం… బ్రిటన్ విదేశాంగ మంత్రి డోమినిక్ రాబ్…
భారత్ - బ్రిటన్ దేశ సంబంధాల్లో మరో నూతన అధ్యాయం మొదలవనుంది. భారత గణతంత్ర దినోత్సవానికి బ్రిటన్ ప్రధాని జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నన్న నేపథ్యంలో బ్రిటన్ విదేశాంగ మంత్రి డోమినిక్ రాబ్ భారత్‌లో పర్యటిస్తున్నారు.
భారత్ – బ్రిటన్ దేశ సంబంధాల్లో మరో నూతన అధ్యాయం మొదలవనుంది. భారత గణతంత్ర దినోత్సవానికి బ్రిటన్ ప్రధాని జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్న నేపథ్యంలో బ్రిటన్ విదేశాంగ మంత్రి డోమినిక్ రాబ్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయనతో దేశ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్ 4 గంటల పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.
10 సంవత్సరాల ప్రణాళిక …
వాణిజ్యం-అభివృద్ధి, రక్షణ-భద్రత, వాతావరణ మార్పులు, ఆరోగ్య సేవలు, ఉభయ దేశ ప్రజల మధ్య అనుసంధానం గురించి ప్రధానంగా చర్చించినట్టు నేతలిద్దరూ తెలిపారు. ‘‘ఉభయ దేశాల సంబంధాలకు సంబంధించి 10 సంవత్సరాల రోడ్‌మ్యాప్ విషయంలో ఇద్దరి మధ్య పలు అంశాల్లో అంగీకారం కుదిరింది. 2021 నుంచి దీన్ని అమల్లోకి తీసుకెళ్తాం. జీ7, ఐరాస వాతావరణ మార్పు సదస్సుల నుంచే ఇది ప్రారంభమవుతుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా వచ్చే ఏడాది నుంచి మరింత ముందడుగు వేస్తాం. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా బోరిస్‌ను ఆహ్వానించడం మాకు గర్వకారణం’’ అని రాబ్ పేర్కొన్నారు. కాగా భారత్-బ్రిటన్ సంబంధాల్లో నూతన శకం ఆరంభానికి ఇది శుభ సూచిక అని దేశ విదేశీ వ్యవహారాల శాఖ జైశంకర్ అన్నారు.