ఈ నెల 14 నుంచి పార్లమెంట్, ప్రశ్నోత్తరాల సమయం రద్దు

ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్ క్రైసిస్ దృష్ట్యా ఎంపీలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నెల 14 నుంచి పార్లమెంట్, ప్రశ్నోత్తరాల సమయం రద్దు
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Sep 02, 2020 | 11:27 AM

ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్ క్రైసిస్ దృష్ట్యా ఎంపీలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. ఉభయ సభలు రెండు షిఫ్తుల్లో పని చేస్తాయి. లోక్ సభ మొదటిరోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు పని చేస్తుంది. ఆ తరువాత అక్టోబరు వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటలవరకు ఉంటుంది. రాజ్యసభ తొలిరోజున మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటలవరకు, మిగతా రోజుల్లో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఉంటుంది. వీకెండ్  డేస్ అన్న ప్రసక్తి ఉండదు. జీరో అవర్ అరగంట సేపు ఉంటుంది. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలన్న నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.