మధుర జైలు నుంచి యూపీ డాక్టర్ విడుదల
యూపీకి చెందిన కఫీల్ ఖాన్ అనే డాక్టర్ ని మధుర జైలు నుంచి నిన్న అర్ధరాత్రి విడుదల చేశారు. సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రసంగించినందుకు, రెచ్ఛగొట్టే వ్యాఖ్యలు చేశాడన్న..
యూపీకి చెందిన కఫీల్ ఖాన్ అనే డాక్టర్ ని మధుర జైలు నుంచి నిన్న అర్ధరాత్రి విడుదల చేశారు. సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రసంగించినందుకు, రెచ్ఛగొట్టే వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణపై జాతీయ భద్రతా చట్టం కింద గత జనవరి 29 న గోరఖ్ పూర్ లో ఇతడిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి మధుర జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇతని నిర్బంధం అక్రమమని, వెంటనే విడుదల చేయాలనీ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇతని ప్రసంగంలో ద్వేషపూరిత వ్యాఖ్యలు లేవని కోర్టు అభిప్రాయపడింది. తనను విడుదల చేసినందుకు కఫీల్ ఖాన్ కోర్టుకు కృతజ్ఞతలు తెలిపాడు. ముంబై నుంచి మధురకు తీసుకువస్తుండగా తనను పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారని భయపడ్డానని ఈ డాక్టర్ వ్యాఖ్యానించాడు.