ఇండియాపై సోషల్ మీడియా ద్వారా విషం కక్కుతున్న పాకిస్తాన్

తమదేశంపై పై పాకిస్తాన్ సోషల్ మీడియా ద్వారా విషం కక్కుతోందని భారత్ ఆరోపించింది. ఫేస్ బుక్ తదితర సాధనాల్లో తప్పుడు సమాచారాన్ని ఇస్తోందని, ఫేక్ న్యూస్ ని వ్యాపింప జేస్తోందని...

ఇండియాపై సోషల్ మీడియా ద్వారా విషం కక్కుతున్న పాకిస్తాన్
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Sep 02, 2020 | 11:32 AM

తమదేశంపై పై పాకిస్తాన్ సోషల్ మీడియా ద్వారా విషం కక్కుతోందని భారత్ ఆరోపించింది. ఫేస్ బుక్ తదితర సాధనాల్లో తప్పుడు సమాచారాన్ని ఇస్తోందని, ఫేక్ న్యూస్ ని వ్యాపింప జేస్తోందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి ట్వీట్ చేశారు. 103 ఫేస్ బుక్ పేజీలు, 78 గ్రూపులు, 453 ఖాతాలు, 107 ఇన్ స్టా గ్రామ్ అకౌంట్లు ఇలాంటి విష ప్రచారంతో నిండిపోయాయని స్టాన్ ఫోర్డ్ ఇంటర్నెట్ అబ్జర్వేటరీ కూడా ఓ నివేదికను ప్రచురించింది.అయితే వీటిని ఫేస్ బుక్ తొలగించిందని, పాక్ లోని కొందరు వ్యక్తులే ఈ తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నట్టు తమ ఇన్వెస్టిగేషన్ లో తేలినట్టు వెల్లడించిందని ఈ సంస్థ వివరించింది. అయితే  దీనిపై ఐక్యరాజ్యసమితి స్పందన ఇంకా తెలియాల్సి ఉంది.