ఇండియాలో క‌రోనా క‌ల్లోలం : ఒక్క రోజులో 1045 మరణాలు

దేశంలో కరోనా వీర‌విహారం చేస్తోంది. మంగళవారం ఒక్కరోజే 78,357 కొత్త కేసులు న‌మోద‌య్యాయి.

ఇండియాలో క‌రోనా క‌ల్లోలం : ఒక్క రోజులో 1045 మరణాలు
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 02, 2020 | 11:05 AM

దేశంలో కరోనా వీర‌‌విహారం చేస్తోంది. మంగళవారం ఒక్కరోజే 78,357 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 37,69,524కు చేరింది. వీరిలో ఇప్పటికే 29లక్షల మంది కోలుకోగా మరో 8లక్షల యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వైరస్​ కార‌ణంగా కొత్త‌గా మరో 1,045 మంది ప్రాణాలు విడువ‌గా..మొత్తం మరణాల సంఖ్య 66,333కు చేరింది. దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 10,12,367 కరోనా టెస్టులు చేసిన‌ట్లు ఐసీఎంఆర్. ఫలితంగా మొత్తం టెస్ట్​ల సంఖ్య 4 కోట్ల 43 లక్షలకు చేరింది.

క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్న‌ప్ప‌టికీ.. రిక‌వ‌రీ అయ్యేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దేశవ్యాప్త రికవరీ రేటు 76.98 శాతంగా ఉండ‌గా, డెత్ రేటు 1.76 శాతానికి పడిపోయింది.

Also Read :

వైసీపీలో విషాదం : కీల‌క నేత ఆక‌స్మిక మ‌ర‌ణం

మద్యం వ్యవహారం : ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్

కళింగపట్నంలో ఆక‌ట్టుకుంటున్న‌ పవన్ సైకత శిల్పం