పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై
మానవతా వాదిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ నేడు 50వ బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అటు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు, ప్రతి ఒక్కరు పవన్‌కు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రంగంతో పాటు రాజకీయాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. లక్షలాది అభిమానుల గుండెల్లో నిలువెత్తు రూపాన్ని నింపుకున్నారు. ముక్కుసూటితనం, అడ్డంకుల్ని లెక్కచేయనిగుణం, సహనం సేవానిరతి, సమాజంపట్ల అక్కర ఆయనని అభిమానించే వారికి ఎనలేని ధైర్యాన్ని అందిస్తుంది. నటుడిగానే కాకుండా మానవతా వాదిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ నేడు 50వ బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అటు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు, ప్రతి ఒక్కరు పవన్‌కు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘మీరు ఎప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి… జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలి’’ అంటూ గవర్నర్ తమిళిసై ట్వీట్ చేశారు.
birthday greetings to Shri @PawanKalyan garu and prayers for happy, healthy & successful years ahead?????? #PawannKalyanBirthday #Telangana #Governor #TamilisaiSoundararajan pic.twitter.com/h12aEAh87K
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) September 1, 2020