AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహా నేతకు సీఎం జగన్ నివాళులు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రితోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటు...

మహా నేతకు సీఎం జగన్ నివాళులు
Sanjay Kasula
|

Updated on: Sep 02, 2020 | 10:22 AM

Share

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రితోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటు వైయస్ విజయమ్మ, వైయస్ భారతి, వైయస్ షర్మిల, ముఖ్యమంత్రి మామ డా.ఇ.సి.గంగిరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి, వారి కుటుంబసభ్యులు, ఇతరులు అందరూ ఘాట్ వద్ద ప్రార్థనలు నిర్వహించారు.

కోవిడ్ నేపథ్యంలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సహా ప్రతి ఒక్కరికి హ్యాండ్స్ శానిటేషన్, ధర్మల్ స్క్రీనింగ్ చేశారు. సామాజిక దూరం పాటిస్తూ కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్యమంత్రితో పాటు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజద్ భాష, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు సి. శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఎంఎల్సీలు వెన్నుపూస గోపాల్ రెడ్డి, జకియా ఖానం, ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ సి హరికిరణ్, ఎస్పి కేకేఎన్ అన్బురాజన్, జాయింట్ కలెక్టర్లు ఎం.గౌతమి, సి.ఎం. సాయికాంత్ వర్మ, సబ్ కలెక్టర్లు పృథ్వి తేజ్, కేతన్ గార్గ్, ట్రైనీ కలెక్టర్ వికాస్ మర్మాట్, ఓఎస్ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు .

Follow Us
ఇంట్లో ఈ ప్రదేశాల్లో దీపం వెలిగించకండి.. వాస్తు నియమాలు..
ఇంట్లో ఈ ప్రదేశాల్లో దీపం వెలిగించకండి.. వాస్తు నియమాలు..
చిటికెడు పొడితో.. బీపీ 190 ఉన్నా 110 కి దిగి రావాల్సిందే!
చిటికెడు పొడితో.. బీపీ 190 ఉన్నా 110 కి దిగి రావాల్సిందే!
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం..
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం..
చిట్టి పునుగులు తినాలనిపిస్తే.. అప్పటికప్పుడు ఇలా చేయండి!
చిట్టి పునుగులు తినాలనిపిస్తే.. అప్పటికప్పుడు ఇలా చేయండి!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా, దీపావళి స్పెషల్ ట్రైన్స్ ఇవే
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా, దీపావళి స్పెషల్ ట్రైన్స్ ఇవే
OTTలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTTలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలబద్ధకానికి చెక్ పెట్టాలా? ఈ పండ్లను మీ డైట్‌లో చేర్చుకోండి!
మలబద్ధకానికి చెక్ పెట్టాలా? ఈ పండ్లను మీ డైట్‌లో చేర్చుకోండి!
అతడు సినిమాలో త్రిష అక్కగా నటించిన హారిక గుర్తున్నారా ?
అతడు సినిమాలో త్రిష అక్కగా నటించిన హారిక గుర్తున్నారా ?
బంగారం కాదు మార్కెట్లో వెండి మెరుపులు.. 150శాతం లాభాలతో సరికొత్త
బంగారం కాదు మార్కెట్లో వెండి మెరుపులు.. 150శాతం లాభాలతో సరికొత్త
చేతులు, ఓ కాలు లేకపోయినా .. 92% మార్కులతో స్కూల్‌ టాప్‌!
చేతులు, ఓ కాలు లేకపోయినా .. 92% మార్కులతో స్కూల్‌ టాప్‌!