ఇలా నిల్వ చేస్తే స్ట్రాబెర్రీలు ఎక్కువ కాలం తాజాగా.. ఇలాంటివి మాత్రమే కొనండి!
31 July 2026
TV9 Telugu
TV9 Telugu
కాస్త తీపి, ఇంకాస్త పులుపు కలగలిసిన స్ట్రాబెర్రీలు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటాయి. రుచితోపాటు పోషక విలువలు కూడా వీటిలో సమృద్ధిగా ఉంటాయి
TV9 Telugu
వీటిని తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, మాంగనీస్, ఫోలేట్, పొటాషియం, బి విటమిన్లు వంటి అనేక కీలక పోషకాలను అందిస్తాయి
TV9 Telugu
అయితే సరైన విధంగా నిల్వ చేయడం వల్ల స్ట్రాబెర్రీలను ఎక్కువ కాలం ఆస్వాదించవచ్చు. శీతాకాలంలో మాత్రమే లభించే స్ట్రాబెర్రీలు రుచి, మంచి నాణ్యతతో ఉంటాయి
TV9 Telugu
ఈ కాలంలో పండే స్ట్రాబెర్రీలు సహజమైన తీపి, సువాసనతో ఉంటాయి. అందువల్ల సీజన్‌లోనే వీటిని కొనుగోలు చేసి నిల్వ చేస్తే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి
TV9 Telugu
స్ట్రాబెర్రీలను కొనుగోలు చేసే సమయంలో వాటి సువాసనను గమనించాలి. తాజాగా ఉన్న పండ్లకు సహజమైన తియ్యని వాసన ఉంటుంది
TV9 Telugu
దుర్వాసన లేదా పులిసిన వాసన వస్తే వాటిని కొనుగోలు చేయకపోవడం మంచిది. అలాగే స్ట్రాబెర్రీల రంగు, ఆకారాన్ని కూడా పరిశీలించాలి
TV9 Telugu
మంచి స్ట్రాబెర్రీలు గట్టిగా ఉండి ప్రకాశవంతమైన ఎరుపు రంగులో కనిపిస్తాయి. పండుపై నల్లని మచ్చలు, గాయాలు లేదా బూజు ఉండకూడదు
TV9 Telugu
పచ్చగా ఉన్న పండ్లను ఇంటికి తీసుకెళ్లి పండిస్తామని భావించకూడదు. అలాగే పండుకు పైభాగంలో ఉండే ఆకుపచ్చ కాడ తాజాగా, గట్టిగా ఉండటం కూడా నాణ్యతకు సూచిక