AP Debts: ఏపీ సర్కార్ అప్పులపై పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన.. ఎలాంటి మదింపు చేయలేదని స్పష్టం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి మదింపు చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం ఈ ఏడాదిలో పరిమితికి మించి అప్పులు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్‌లో ప్రకటించింది.
Parliament on Andhra Pradesh Debts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి మదింపు చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం ఈ ఏడాదిలో పరిమితికి మించి రు.4 వేల కోట్లకుపైగా అప్పులు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్‌లో ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంత్సరానికిగాను రు.54,369.18 కోట్లు ఆర్థిక లోటుగా రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్‌లో స్పష్టం చేసిందని పేర్కొంది. రాజ్యసభలో తెలుగు దేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 15వ ఆర్థిక సంఘం అనుమతి మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 30,305 కోట్లు, కోవిడ్ కారణంగా మరో రూ. 19,192 కోట్లు అప్పు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. మొత్తంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి రు. 49,497 కోట్లు అప్పు పొందేందుకు అవకాశం కల్పించినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి ‘దిశ’పై ఎలాంటి స్పందన రాలేదని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. రాష్ట్రం పంపిన దిశ బిల్లుపై తమ అభ్యంతరాలపై వివరణ కోరినట్లు తెలిపింది. అయితే, దీనిపై ఏపీ సర్కార్ ఇప్పటివరకు స్పందించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ వెల్లడించారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మాధవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Read Also… Women Commando: తుపాకీ చేతబట్టి అడవుల్లో గస్తీకి అతివలు.. దండకారణ్యంలోకి దంతేశ్వరి మహిళా కమాండోలు