Viral Video: గురుద్వారా ఊడ్చి, భక్తుల బూట్లు పాలీష్ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత.. వైరల్‌గా మారిన వీడియో!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ హరీష్ రావత్ ఎప్పుడు ఏదో విషయంలో సంచలనంగా మారే అతడు, మరోసారి వార్తలోకి ఎక్కారు.
Congress Leader Harish Rawat: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ హరీష్ రావత్ ఎప్పుడు ఏదో విషయంలో సంచలనంగా మారే అతడు, మరోసారి వార్తలోకి ఎక్కారు. గురుద్వారాను శుభ్రం చేయడంతో పాటు అక్కడికి వచ్చిన భక్తుల బూట్లు పాలిష్ చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉద్ధమ్‌సింగ్ నగర్‌లోని ఖతిమా సమీపంలో ఉన్న నానకమట్ట గురుద్వారా అంతస్తును చీపురుతో ఊడ్చారు.
సెప్టెంబర్ 1 న, పంజాబ్ పార్టీ కార్యకర్తలను ‘పంజ్ ప్యారే’ అని పేర్కొనడం కోసం రావత్ గురుద్వారా అంతస్తును శుభ్రం చేస్తానని ప్రకటించాడు. ఈ క్రమంలో ఆయన గురుద్వారాను శుభ్రం చేశారు. ఇదే సమయంలో భక్తుల బూట్లను పాలిష్ చేశారు. ఆ సమయం లో రావత్‌తో పాటుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
పార్టీ రాష్ట్ర విభాగంలో విభేదాల మధ్య చండీగఢ్ చేరుకున్న రావత్, పంజాబ్ కాంగ్రెస్ భవన్‌లో సమావేశం తర్వాత పంజాబ్ కాంగ్రెస్ చీఫ్, నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్‌ల కోసం ‘పంజ్ ప్యారే’ అనే పదాన్ని ఉపయోగించారు. దీంతో విమర్శలు వ్యక్తమవడంతో.. ఇప్పటికే ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పారు. తన ఫేస్‌బుక్ పేజీలో, తరువాత, రావత్ తన ‘పంజ్ ప్యారే’ వ్యాఖ్యకు తన “తప్పు” ని అంగీకరించాడు.
“కొన్నిసార్లు గౌరవాన్ని వ్యక్తం చేయడం ద్వారా, మీరు అభ్యంతరకరమైన పదాలను ఉపయోగిస్తారు. నేను కూడా నా గౌరవప్రదమైన పంజాబ్ కాంగ్రెస్ చీఫ్, నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్‌ల కోసం ‘పంజ్ ప్యారే’ అనే పదాన్ని ఉపయోగించడం తప్పు చేశాను “అని ఆయన పేర్కొన్నారు.
#सतनाम_वाहेगुरु#नानकमत्ता श्री गुरुद्वारा साहब में मैंने प्रायश्चित स्वरूप कुछ देर #जूते साफ किये। मैं, सिख धर्म और उसकी महान परंपराओं के प्रति हमेशा समर्पित भाव और आदर भाव रखता रहा हूँ। 1/2 pic.twitter.com/8Mrx05J7ZM
— Harish Rawat (@harishrawatcmuk) September 3, 2021
Read Also…. ఈ గొర్రెలు పెంచుకుంటే లక్షల్లో ఆదాయం.. అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం..: Dumba Sheep Video.