AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistani Drone: సరిహద్దుల్లో పాకిస్తాన్‌ డ్రోన్స్‌ కలకలం.. కూల్చేసిన భద్రత బలగాలు.. భారీగా లభించిన..

సరిహద్దుల్లో పాకిస్తాన్‌ డ్రోన్స్‌ కలకలం సృష్టిస్తున్నాయి. తరచుగా పంజాబ్‌ బోర్డర్స్‌లో కొద్ది రోజులుగా పాక్‌ డ్రోన్స్‌ టెన్షన్‌ పెడుతున్నాయి. తాజాగా పంజాబ్‌ తరన్‌ తరన్‌ జిల్లాలోని కాలియా గ్రామంలో హెరాయిన్‌ ప్యాకెట్‌ లభ్యమైంది.

Pakistani Drone: సరిహద్దుల్లో పాకిస్తాన్‌ డ్రోన్స్‌ కలకలం.. కూల్చేసిన భద్రత బలగాలు.. భారీగా లభించిన..
Bsf Shoots Down Pakistani Drone
Sanjay Kasula
|

Updated on: Dec 06, 2022 | 12:50 PM

Share

సరిహద్దుల్లో పాకిస్తాన్‌ డ్రోన్స్‌ కలకలం సృష్టిస్తున్నాయి. పంజాబ్‌ బోర్డర్స్‌లో కొద్ది రోజులుగా పాక్‌ డ్రోన్స్‌ కదలికలు..సెక్యూరిటీ సిబ్బందికి అలర్ట్ అయ్యారు. తాజాగా పంజాబ్‌ తరన్‌ తరన్‌ జిల్లాలోని కాలియా గ్రామంలో.. డ్రోన్‌లో హెరాయిన్‌ ప్యాకెట్‌ లభ్యమైంది. ఆ ప్యాకెట్‌లో రెండున్నర కేజీల హెరాయిన్‌ను గుర్తించారు అధికారులు. అయితే అప్రమత్తమైన సరిహద్దు భద్రతా దళాలు..ఆ డ్రోన్‌ను కూల్చివేశాయి. పాక్‌ నుంచి భారత్‌లోకి చొరబడుతున్న ఉగ్రవాదుల అవసరాలు తీర్చడానికి..డ్రోన్‌లను వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు యువతను మత్తుకు బానిసలుగా చేయాలనే కుట్రతో కూడా డ్రగ్స్‌ సప్లై చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అమృత్‌సర్ సెక్టార్‌లో నియమించబడిన BSF జవాన్లు ఆదివారం అర్ధరాత్రి పాకిస్తాన్ నుండి వస్తున్న డ్రోన్‌ను కూల్చివేశారు. ఆ ప్రాంతాన్ని శోధించారు. ఈ రోజు ఉదయం డ్రోన్‌తో పాటు 1 కిలోల హెరాయిన్ మరియు 200 గ్రాముల ఓపియం 2 ప్యాకెట్లను కనుగొన్నారు.

మరోవైపు జమ్ముకశ్మీర్‌ సరిహద్దుల్లో ఇటీవల ఓ అనుమానాస్పద డ్రోన్‌ కలకలం రేపింది. సాంబ జిల్లాలోని విజయ్‌పూర్‌ ప్రాంతంలో వదిలివెళ్లిన డ్రోన్‌లో అత్యాధునిక ఆయుధాలున్నాయి. అవి పాకిస్తాన్‌కి చెందినవిగా గుర్తించారు. అలాగే ఐదు లక్షల కరెన్సీ కూడా గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం