AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రజలు సహకరిస్తే.. పాకిస్తాన్ ని కూడా హిందూ దేశంగా మారుస్తా.. సూరత్‌లో ధీరేంద్ర శాస్త్రి

ప్రజలందరూ ఏకమైతే పాకిస్థాన్‌ను కూడా హిందూ దేశంగా మార్చవచ్చునని అన్నారు. తాను  గుజరాత్ ప్రజల నుండి డబ్బు లేదా కీర్తిని కోరుకోవడం లేదని.. తనకు అసలు అలాంటి ఉద్దేశం లేదని బాగేశ్వర్ ధామ్ అధిపతి అన్నారు. హిందుత్వం పేరుతో హిందువులను ఏకం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు చెప్పారు.

ప్రజలు సహకరిస్తే.. పాకిస్తాన్ ని కూడా హిందూ దేశంగా మారుస్తా.. సూరత్‌లో ధీరేంద్ర శాస్త్రి
Dhirendra Shastri
Follow us
Surya Kala

|

Updated on: May 29, 2023 | 2:00 PM

బాగేశ్వర్ ధామ్ ట్రస్ట్ చీఫ్ ఆచార్య ధీరేంద్ర శాస్త్రి  మరోసారి హిందుత్వంపై, పాకిస్తాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన బహిరంగ సభ .. దివ్య దర్బార్ లో ధీరేంద్ర శాస్త్రి మాట్లాడుతూ.. ప్రజలందరూ ఏకమైతే పాకిస్థాన్‌ను కూడా హిందూ దేశంగా మార్చవచ్చునని అన్నారు. తాను  గుజరాత్ ప్రజల నుండి డబ్బు లేదా కీర్తిని కోరుకోవడం లేదని.. తనకు అసలు అలాంటి ఉద్దేశం లేదని బాగేశ్వర్ ధామ్ అధిపతి అన్నారు. హిందుత్వం పేరుతో హిందువులను ఏకం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు చెప్పారు. సభకు వచ్చిన జనాలను ఉద్దేశించి “మీరు అంటే.. హిందువులు  ఐక్యంగా ఉంటే.. భారతదేశం లేదా పాకిస్తాన్‌ను తాను హిందూ దేశంగా మారుస్తారు” అని ద్రీరేంద్ర శాస్త్రి అన్నారు. ‘

ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు ధీరేంద్ర శాస్త్రిని “భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చడం ఎలా సాధ్యమవుతుంది?” అని కొందరు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బదులిస్తూ.. “భారతదేశం ఇప్పుడే కాదు ఎప్పుడూ హిందూ దేశమే..  అలాగే ఉంటుందన్నారు.

అయోధ్యలోని రామ మందిరం సమస్యను ప్రస్తావిస్తూ.. ఇప్పటికి రామ మందిర సమస్య తీరింది. ఇక ఇప్పుడు మధుర వంతు వచ్చింది.. కనుక ఇప్పుడైనా “సనాతనీయులు మేల్కొనవలసిన సమయం” ఆసన్నం అయినందని అని అన్నారు.

ఇవి కూడా చదవండి

బాగేశ్వర్ ధామ్ అధినేత  పాకిస్తాన్  ను హిందూ దేశంగా చేస్తానంటూ చేసిన ప్రకటనపై పలువురు సోషల్ మీడియా వినియోగదారులు స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం ఆధిపత్య మతంగా మారాలని కొందరు అతనికి మద్దతు ఇస్తుండగా.. జనాభా ప్రాబల్యం ఉన్నప్పటికీ భారతదేశం కూడా హిందూ దేశంగా మారలేకపోయింది. మరి అలాంటిది “ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ ను హిందూ దేశంగా మార్చడం ఎలా” అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..