AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil nadu: అధ్వానంగా ఉన్న రోడ్డు.. ఆగిన అంబులెన్స్.. చిన్నారి మృతదేహాన్ని మోసుకునివెళ్ళిన తల్లి..

ఓ తల్లి తన కూతురు మృతదేహాన్ని భుజాన వేసుకుని కిలోమీటర్ల మేర మోసుకుని వెళ్లింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వెల్లూరు జిల్లాలో అల్లేరి గ్రామంలో 18 నెలల బాలిక తన తండ్రి విజి, తల్లి ప్రియలతో కలిసి ఇంటి బయట నిద్రిస్తోంది.

Tamil nadu: అధ్వానంగా ఉన్న రోడ్డు.. ఆగిన అంబులెన్స్.. చిన్నారి మృతదేహాన్ని మోసుకునివెళ్ళిన తల్లి..
mother carries the body on shoulder
Surya Kala
|

Updated on: May 29, 2023 | 8:53 AM

Share

దేశం స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలు గడిచాయి.. అన్ని రంగాల్లో అగ్రరాజ్యాలకు ధీటుగా ఎదుగుతూ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే దేశంలో కొన్ని సార్లు జరుగుతున్న ఘటనలు చూస్తే.. అభివృద్ధి కొన్ని  ప్రాంతాలకే పరిమితమా అనిపించక మానదు ఎవరికైనా.. అభివృద్ధి చెందిన పట్టణాల్లో ఆకాశాన్ని తాకుతున్న ఎత్తైన భవనాలు, నల్ల తాచులా కనిపించే అద్భుతమైన రోడ్లు కనిపిస్తాయి. అయితే ఇప్పటికీ కనీసం రోడ్డు సదుపాయాలు లేని గ్రామాలున్నాయి. కనీసవసరాలు తీర్చుకోవడానికి ఆ గ్రామస్థులు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లాల్సిందే. తాజాగా ఓ తల్లి తన కూతురు మృతదేహాన్ని భుజాన వేసుకుని కిలోమీటర్ల మేర మోసుకుని వెళ్లింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

వెల్లూరు జిల్లాలో అల్లేరి గ్రామంలో 18 నెలల బాలిక తన తండ్రి విజి, తల్లి ప్రియలతో కలిసి ఇంటి బయట నిద్రిస్తోంది. ఈ సమయంలో ఓ పాము చిన్నారి బాలికను కాటు వేసింది. బాలికను వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. అయితే రోడ్డు సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో చిన్నారిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లేందుకు చాలా సమయం పట్టింది. బాలికను పరిశీలించిన వైద్యులు.. విషం శరీరం అంతా వ్యాపించిందని.. అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు.

ఆనైకట్టు పోలీసులు బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన ఆనైకట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అంబులెన్స్‌లో తీసుకెళ్లి మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తల్లిదండ్రులకు అప్పగించారు. వెల్లూరులో రోడ్లు అధ్వాన్నంగా ఉండడంతో బాధితురాలి తల్లిదండ్రులు, చనిపోయిన బాలికతో వెళ్తున్న అంబులెన్స్‌ పాడైపోయింది. దీంతో లోకాన్ని వీడిన చిన్నారి కూతురి మృత దేశాన్ని తల్లి భుజంపై ఎత్తుకుని ఎగుడు దిగుడు రోడ్డు గుండా కాలినడకన గ్రామానికి చేరుకుంది.

ఇవి కూడా చదవండి

అంతకుముందు ఫిబ్రవరిలో.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, చెన్నై నుండి రాణిపేట (NH-4) ను కలిపే రహదారి దుస్థితి గురించి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. రోడ్డు పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని, వేలూరు, రాణిపేట్, తిరుపత్తూరు, తిరువణ్ణామలై జిల్లాలకు రైలులో వెళ్లేందుకు రైల్వే  లైన్ కు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..