AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఆపరేషన్ సింధూర్‌ తర్వాత జాతినుద్దేశించి తొలి సందేశం.. అందరిచూపు ప్రధాని మోదీ ప్రసంగం వైపే..

భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. అయితే.. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమయ్యాక తొలిసారి ప్రసంగం చేయనున్నారు. దీంతో అందరి చూపు ప్రధాని మోదీ ప్రసంగం పైనే ఉంది..

PM Modi: ఆపరేషన్ సింధూర్‌ తర్వాత జాతినుద్దేశించి తొలి సందేశం.. అందరిచూపు ప్రధాని మోదీ ప్రసంగం వైపే..
PM Narendra Modi
Shaik Madar Saheb
|

Updated on: May 12, 2025 | 5:30 PM

Share

భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. అయితే.. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమయ్యాక తొలిసారి ప్రసంగం చేయనున్నారు. దీంతో అందరి చూపు ప్రధాని మోదీ ప్రసంగం పైనే ఉంది.. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతికారం తర్వాత మాట్లాడనున్న మోదీ.. దేశప్రజలకు ఏం చెప్పనున్నారు.. పాకిస్తాన్ కు ఎలాంటి వార్నింగ్ ఇవ్వనున్నారు..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఉగ్రవాదం అంతానికి ఆపరేషన్ సింధూర్ ద్వారా చేపట్టిన చర్యలను ప్రధాని మోదీ ప్రజలకు వివరించనున్నారు. కాగా.. ఉగ్రవాదులను ఉగ్రవాదులను.. వారికి మద్దతు ఇచ్చే వారిని మట్టిలో కలిపేస్తాననీ, ఎవరు ఊహించని విధంగా ఉగ్రవాదులను శిక్షిస్తామని మోదీ ఇప్పటికే స్పష్టంచేశారు.

కాగా.. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం.. పాకిస్తాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టి.. పాకిస్తాన్, పీఓకేలో కీలకంగా ఉన్న 9 ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసింది.. దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ క్రమంలోనే.. పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతో.. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది..

ఇదిలాఉంటే.. ఉదయం ప్రధాని నివాసంలో అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఎన్‌ఎస్ఏ అజిత్ దోవల్ ,సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. భారత్‌, పాక్‌ డీజీఎంవో అధికారుల చర్చల నేపథ్యంలో ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు.

లైవ్ వీడియో..

సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి..

సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో జమ్మూకశ్మీర్‌లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇండియా – పాకిస్తాన్‌ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నడుమ మూడు రోజుల పాటు కాల్పుల మోతతో సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్‌లలో ప్రజలు వణికిపోయారు. LOC వెంట కూడా కాల్పుల మోత మోగింది. అయితే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో శనివారం దానిని ఉల్లంఘించిన పాక్ ఆదివారం మాత్రం మౌనంగానే ఉంది. భారత్ సరిహద్దు ప్రాంతం ప్రశాంతంగా నిద్రపోయింది. కొద్దిరోజుల నుంచి సరిహద్దు రాష్ట్రాల్లో తలెత్తిన ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే సమసిపోయి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు సాధారణ జనజీవనం గడుపుతున్నారు.

అయినప్పటికీ, సరిహద్దుల్లోఆర్మీ నిరంతర నిఘా కొనసాగిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని చెబుతోంది. కాల్పుల విరమణ ఒప్పందంతో అఖ్నూర్, రాజౌరి, పూంచ్‌ జిల్లాల్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు రోజుల తర్వాత తాము ప్రశాంతంగా నిద్రపోయామని.. యుద్ధం ఆగేలా చేసినవారందరికీ, ఆ దేవుడికి తాము రుణపడి ఉంటామని శ్రీనగర్‌ స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..