Viral News: పసిపిల్లతో స్విగ్గీ ఏజెంట్ రైడింగ్… ఇసొంటి కష్టం ఎవరికీ రావొద్దంటున్న నెటిజన్స్
గురుగ్రామ్‌కు చెందిన మయాంక్ అగర్వాల్ అనే వ్యక్తి తన లింక్డ్‌ఇన్‌లో భావోద్వేగ అనుభవాన్ని షేర్ చేశాడు. మయాంక్ తన కోసం ఆహారం ఆర్డర్ చేసిన సమయంలో ఓ హృదయవిదారకమైన సన్నివేశం తన కంటపడింది. తన డెలివరీని తీసుకొచ్చిన స్విగ్గీ మ్యాన్‌కు ఫోన్ చేసినప్పుడు ఒక పసిపిల్ల గొంతు విన్నాడు. ఆసక్తిగా...

గురుగ్రామ్‌కు చెందిన మయాంక్ అగర్వాల్ అనే వ్యక్తి తన లింక్డ్‌ఇన్‌లో భావోద్వేగ అనుభవాన్ని షేర్ చేశాడు. మయాంక్ తన కోసం ఆహారం ఆర్డర్ చేసిన సమయంలో ఓ హృదయవిదారకమైన సన్నివేశం తన కంటపడింది. తన డెలివరీని తీసుకొచ్చిన స్విగ్గీ మ్యాన్‌కు ఫోన్ చేసినప్పుడు ఒక పసిపిల్ల గొంతు విన్నాడు. ఆసక్తిగా, అతన్ని కలవడానికి తన ఇంటి నుండి దిగి వచ్చాడు. అతను చూసిన దృశ్యం అతన్ని తీవ్రంగా కదిలించింది.
బైక్‌పై ఒక పసిబిడ్డ తన తండ్రి ముందు నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. ఆ పిల్ల తనతో ఎందుకు ఉన్నాడని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఇలా సమాధానం చెప్పాడు, “ఇంట్లో ఎవరూ లేరు. ఆమె అన్నయ్య పాఠశాలకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చే వరకు ఆమెను నేనే చూసుకోవాలి” అని చెప్పాడు.
ప్రసవ సమయంలో పంకజ్ భార్య మరణించింది. అప్పటి నుంచి అతను ఒంటరిగా తన పిల్లలను పెంచుతున్నాడు. పిల్లల సంరక్షణను చూసుకునేవారు లేకపోవడంతో డెలివరీ షిఫ్ట్‌లలో చిన్నపిల్లను తనతో తీసుకురావడం తప్ప అతనికి వేరే మార్గం లేదని చెప్పాడు. తన పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా పంకజ్ మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. “చాలా మంది కస్టమర్లు ఇంట్లోనే ఉండమని చెప్పారు. కానీ నేను ఇంకా ఏమి చేయగలను?” అని లెక్కలేనంత బాధను లోలోనే దాచకుంటూ చిరునవ్వుతో చెప్పటం మరింత ఆకట్టుకుందని మయాంక్ చెప్పారు.
స్విగ్గీ డెలివరీ మ్యాన్ కథ ఆన్‌లైన్‌లో వేలాది మందిని ఆకట్టుకుంది. గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న కనిపించని కష్టాల గురించి చర్చకు దారి తీసింది. ఉరుకులు, పరుగుల ప్రపంచంలో, పంకజ్ కథ తండ్రి, బిడ్డల మధ్య విడదీయరాని బంధాన్ని తెలియజేస్తుంది. జీవితం భరించలేనంత కష్టంగా మారినప్పుడు కూడా ఎలా ముందుక సాగాలో చెప్పే పాఠంగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Swiggy Delivery Man Story
