ఆపరేషన్ సిందూర్ వర్సెస్ 1971 భారత్-పాక్ వార్.. రెండు మధ్య అసలు నిజం ఇదే!
"నిజం తెలిసి.. నిజాన్ని చూసి కూడా అబద్ధాలను నమ్మడం మూర్ఖత్వం" అన్న రిచర్డ్ పి. ఫెయ్‌న్‌మన్ మాటలు ఇప్పుడు దేశంలో పరిస్థితికి చక్కగా అద్దం పడతాయి. సోషల్ మీడియాతో పాటు కొన్ని సాంప్రదాయ మీడియా సంస్థల్లో వస్తున్న నిరాధారమైన వార్తలు, వాదనలు అలాగే ఉన్నాయి. భారత సైనిక బలగాలు చేపట్టిన "ఆపరేషన్ సిందూర్" విజయవంతమైందని చెప్పేందుకు తగిన ఆధారాలన్నీ చూపించాయి.

“నిజం తెలిసి.. నిజాన్ని చూసి కూడా అబద్ధాలను నమ్మడం మూర్ఖత్వం” అన్న రిచర్డ్ పి. ఫెయ్‌న్‌మన్ మాటలు ఇప్పుడు దేశంలో పరిస్థితికి చక్కగా అద్దం పడతాయి. సోషల్ మీడియాతో పాటు కొన్ని సాంప్రదాయ మీడియా సంస్థల్లో వస్తున్న నిరాధారమైన వార్తలు, వాదనలు అలాగే ఉన్నాయి. భారత సైనిక బలగాలు చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” విజయవంతమైందని చెప్పేందుకు తగిన ఆధారాలన్నీ చూపించాయి. అయినా సరే.. కొందరు ఈ ఆపరేషన్ గురించి నిరాధారమైన ఊహాగానాలు వ్యాప్తి చేస్తున్నారు. పహల్‌గాంలో పర్యాటకుల మతం అడిగి మరీ కాల్చి చంపిన రాక్షసమూకను సంహరించేందుకు చేపట్టిన ఆ ఆపరేషన్‌లో ఉగ్రవాదులను తయారుచేసి భారత్ మీదకు వదులుతున్న పొరుగుదేశం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్ము-కాశ్మీర్ (PoJK)లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలు, శిక్షణా కేంద్రాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. యావత్ ప్రపంచానికి ఈ విషయం తెలుసు. రుజువులు, సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఇందులో మరో చర్చకు అవకాశమే లేదు.
ఆ తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలు, డ్రోన్లు, మిస్సైళ్లలో దాడులకు పాల్పడినప్పుడు భారత్ ధీటుగా బదులిచ్చింది. పాక్ ప్రయోగించిన ఒక్క మిస్సైల్‌ను కూడా లక్ష్యానికి చేరక ముందే గాల్లోనే ధ్వంసం చేయడం, మిడతల దండులా దూసుకొచ్చిన డ్రోన్లను ధ్వంసం చేయడం యావత్ ప్రపంచం చూసింది. పాకిస్తాన్‌లోని 11 ఎయిర్‌బేస్‌లతో పాటు రక్షణ స్థావరాలు, ఫార్వార్డ్ పోస్టులు అనేకం ధ్వంసమయ్యాయి. అదే సమయంలో పాకిస్తాన్ కూడా భారత్‌ను దెబ్బకొట్టినట్టు అసత్య ప్రచారం మొదలుపెట్టింది. ఆ దేశ నాయకులు కూడా పదే పదే ఇదే మాట చెప్పుకొచ్చారు. కానీ తమ వాదనలకు ఒక్క నమ్మదగిన ఆధారం కూడా చూపలేకపోయారు.
ఇలాంటి పరిస్థితిలో కొందరు “మనవాళ్లు” ఇందిరా గాంధీని నరేంద్ర మోదీని పోల్చుతూ ఎవరు గొప్ప అన్న చర్చ లేవనెత్తారు. మోదీ యుద్ధాన్ని గెలవలేక కాల్పుల విరమణకు ఒప్పుకున్నారని, ఇందిరా గాంధీ 1971 యుద్ధంలో సైన్యాన్ని గెలిపించారని కథనాలు ప్రచారంలోకి తీసుకొచ్చారు. రాజకీయ చర్చ, ఊహాగానాలను కాసేపు పక్కన పెట్టి, 1971 యుద్ధంలో మనం ఏమి సాధించామన్నది ఓసారి లోతుగా విశ్లేషిద్దాం..
మనం బంగ్లాదేశ్‌ను విడిపించి, రాత్రికి రాత్రి ఇజ్రాయెల్, సోవియట్ యూనియన్‌తో పాటు దానికి గుర్తింపు తీసుకొచ్చాం. తూర్పు బెంగాల్‌లో హిందువులు, ముస్లింలపై జరుగుతున్న ఊచకోతను నిలువరించగలిగాం. అమెరికా-రష్యా కూటముల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ సమయంలో భారత్‌ను శత్రు శక్తులు చుట్టుముట్టే అవకాశాన్ని తొలగించాం. అంతేకాదు, భారత్‌కు వచ్చిన శరణార్థులను ఆదరించాం. నిజానికి ఈ చర్య దేశంపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపింది. చాలామంది శరణార్థులు బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లారు. ముఖ్యంగా ఇస్లామిస్టుల టార్గెట్‌లో ఉన్న హిందువులు కూడా వెనక్కి వెళ్లారు. కానీ, బంగ్లాదేశ్‌లో మిగిలిన హిందువులు అప్పటి నుంచి ఉనికి కోసం పోరాడుతూ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
1971 యుద్ధం గెలిచినా సాధించలేని వాటి జాబితా:
బంగ్లాదేశ్‌ను దౌత్యపరంగా కాపాడుకోలేకపోయాం. ముజీబ్ రహమాన్‌ను విడిచిపెట్టడంతో పాటు 93,000 మంది పాక్ యుద్ధ ఖైదీలను విడుదల చేశాం. ముజీబ్ 1946లో గ్రేటర్ కోల్‌కతా హత్యాకాండలో ముస్లిం లీగ్ నాయకుడిగా పాత్ర పోషించాడు. భారతదేశం ఈ యుద్ధంలో 3,000 మంది సైనికులను కోల్పోయింది. మరో 12,000 మంది సైనికులు గాయపడ్డారు. ఇది మన బాధాకరమైన నష్టం. అదే సమయంలో “మిస్సింగ్ 54” సైనికులను తిరిగి తీసుకురాలేకపోయాం. వారిని పాకిస్తాన్ గూఢచర్యానికి ఉపయోగించింది.
అలాగే పండిత్ నెహ్రూ అమలు చేస్తూ వచ్చిన అలీన విధానం (అటు సోవియట్, ఇటు అమెరికాతో సమాన దూరం) కొనసాగించలేకపోయాం. 1971 యుద్ధం గెలిచిన తర్వాత మన దౌత్యం ఎందుకు విఫలమైంది? అన్న ప్రశ్నకు “మిత్రోఖిన్ ఆర్కైవ్స్” నుంచి ఒక విషయం తెలుస్తుంది. 1992లో పశ్చిమ దేశాలకు కేజీబీ అధికారి వాసిలీ మిత్రోఖిన్ రాసిన లేఖలు గమనిస్తే, ఇందిరా గాంధీ సోవియట్‌లకు (కోడ్ నేమ్: వానో) సహకరించారని, కాంగ్రెస్‌లోని దేశభక్త నాయకులను పక్కనపెట్టడానికి కేజీబీ ముఖ్య పాత్ర పోషించిందని తెలుస్తోంది. ఈ విషయం భారత రాజకీయాల్లో ఎప్పుడూ చర్చకు రాలేదు. వాజ్‌పేయి 2004 ఎన్నికల సమయంలో ఒక ఇంటర్వ్యూలో ఇందిరా గాంధీని సిమ్లా ఒప్పందంపై సంతకం చేయవద్దని చెప్పానని అన్నారు. ఆయన రాజనీతిజ్ఞత కారణంగా అంతకంటే ఎక్కువ రహస్యాలను వెల్లడించలేదు. ఐదు దశాబ్దాల తర్వాత, సిమ్లా ఒప్పందం చారిత్రక తప్పిదం లాంటిదని తేలింది. ఇది కాశ్మీర్ అంశాన్ని నెహ్రూ ఐక్యరాజ్య సమితి ముందుకు తీసుకెళ్లడం వంటి తప్పిదమని తేలింది.
ప్రస్తుత పరిస్థితుల్లో, భారత్ ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది. విజ్ఞత కలిగిన ఏ నేతయినా.. పాకిస్తాన్ లాంటి విఫల రాష్ట్రంతో సైనిక యుద్ధం అనవసరమనే అంటారు. మన ప్రధాన లక్ష్యం పహల్గామ్‌లో 26 మంది ముస్లీమేతర పర్యాటకుల మరణానికి తగిన గుణపాఠం నేర్పడం. అదే జరిగింది. కానీ పాకిస్తాన్ తాను వేరు, ఉగ్రవాదం వేరు కాదని నిరూపించుకుంది. ఉగ్రవాద స్థావరాలపై దాడిని తమపై జరిగిన దాడిగా భావించింది. భారత్‌పై క్షిపణి దాడులకు తెగబడింది. భారత్ ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా జరిపిన ఎదురుదాడిలో పాకిస్తాన్‌లోని అనేక ఉగ్రవాద కేంద్రాలను, లెక్కలేనన్ని ఉగ్రవాదులను, పాక్ వైమానిక స్థావరాలను, సైనిక బేస్‌లను ధ్వంసం చేసి, పాకిస్తాన్ ఆకాశ ఆధిపత్యాన్ని తుడిచిపెట్టింది. ఇది పాకిస్తాన్‌కు భారీ ఆర్థిక, వ్యూహాత్మక ఎదురుదెబ్బ. బలూచిస్తాన్ ఇప్పటికే పాక్ ప్రభుత్వ నియంత్రణలో లేదు. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా కూడా త్వరలో అదే దారిలో పోతోంది. ఇప్పుడు మిగిలిన యుద్ధం పీఓకే తిరిగి స్వాధీనం చేసుకోవడం మాత్రమే..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




