Bengaluru: రైల్వే ట్రాక్ పక్కన కనిపించిన సూట్‌కేస్.. తెరిచి చూడగా కనిపించిన దాన్ని చూసి నివ్వెరపోయిన స్థానికులు!
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ బాలికను అత్యంత దారుణంగా హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి చందాపురం రైల్వే స్టేషన్ సమీపంలో పడేసి వెళ్లిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సుమారు 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న ఓ బాలికను హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్క రైల్వే ట్రాక్ సమీపంలో పడేసిన ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో వెలుగు చూసింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు శివారులోని చందాపుర రైల్వే ట్రాక్ సమీపంలో ఓ సూట్‌కేసును గమనించారు కొందరు స్తానికులు. అయితే ఆ సూట్‌కేస్ నుంచి దుర్వాసన రావడం.. దాని చుట్టూ ఈగలు వంటివి తిరగడంతో అనుమానం వచ్చి సూట్‌కేసును ఓపెన్ చేసి చూశారు. సూట్‌కేస్‌లో కనిపించిన దృశ్యాన్ని చూసిన వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
స్థానికుల సమాచారంతో హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకున్న సూర్యానగర్ పోలీసులు సూట్‌కేసును పరిశీలించారు. దాని తెరిచి చూడగా, అందులో రక్తపు ముడుగులో ఉన్న ఓ బాలిక మృతదేహం దర్శనం ఇచ్చింది. ఆ మృతదేహాన్ని చూసిన పోలీసులు కూడా ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇక బాలిక మృతదేహాన్ని సూట్‌కేసు నుంచి బయటకు తీసిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఆ బాలిక వయస్సు 15 నుంచి 18 ఏళ్ల మధ్య ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.
అయితే నిందితులు బాలికను మరో చోట హత్య చేసి.. తర్వాత మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి ఉంటారని.. ఆ సూట్‌కేసును రన్నింగ్ ట్రైన్‌లోంచి పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్థానికంగా ఉన్న సీసీ టీవీ దృశ్యాలు, ఇతర ఆధారాల ద్వారా ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే హత్యకు గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..