Viral News: సాదుకుంటానని నమ్మించి చంపి తింటుంది… చివరికి ఇలా దొరికింది
సాధారణంగా పిల్లులు, కుక్కలు, ఆవులు వంటి జంతువులను ఆశ్రమాల నుంచి దత్తత తీసుకుంటూ ఉంటారు. వాటికి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చి ఇంటిలో ఓ సభ్యుడిగా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఇక్కడో మహిళ మాత్రం కేవలం చంపడానికే కుక్కలను దత్తత తీసుకుంటుంది. అంతేకాదు.. వాటిని వండి మరీ పిల్లలకు...

సాధారణంగా పిల్లులు, కుక్కలు, ఆవులు వంటి జంతువులను ఆశ్రమాల నుంచి దత్తత తీసుకుంటూ ఉంటారు. వాటికి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చి ఇంటిలో ఓ సభ్యుడిగా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఇక్కడో మహిళ మాత్రం కేవలం చంపడానికే కుక్కలను దత్తత తీసుకుంటుంది. అంతేకాదు.. వాటిని వండి మరీ పిల్లలకు పెడుతుంది. పైగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. ఈ ఘటన చైనాలో జరిగింది. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. వీధి కుక్కలను రెస్క్యూ చేసే గ్రూప్ నుంచి వాటిని దత్తత తీసుకుని, తరువాత వాటిని చంపి వండినందుకు ఒక చైనా మహిళపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. స్థానిక ధాన్యం దుకాణ యజమాని అయిన జిక్సువాన్ అనే మహిళ సోషల్ మీడియాలో వాటిని వండుతున్న అనేక పోస్ట్‌లు, వీడియోలను పోస్ట్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఆ మహిళ జంతు ఆశ్రమాలకు వెళ్లి వాటిని బాగా చూసుకుంటానని నమ్మించి కుక్కలను దత్తత తీసుకుంటుంది. తరువాత ఆమె వాటిని వధించడం ప్రారంభించింది. తాను కుక్క మాంసం వండుతున్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒక పోస్ట్‌లో, “కుక్క మాంసం దాదాపు సిద్ధంగా ఉంది. వర్షం కురుస్తున్న సమయంలో మంచి పానీయానికి సరైన డిష్ అంటూ పోస్టు పెట్టింది. మరొక పోస్ట్‌లో, ఆమె తన బిడ్డ కుక్క మాంసం తింటున్న ఫోటోను పెట్టి “పిల్లవాడికి మాత్రమే ఉత్తమమైనది” అనే శీర్షికతో షేర్ చేసింది.
వెంటనే, లియోనింగ్ ప్రావిన్స్‌లోని ఒక జంతు సంరక్షణ కేంద్రానికి ఆ మహిళ చేసిన చర్యల గురించి అనేక ఫిర్యాదులు అందాయి. మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన అధికారులు కుక్క మాంసాన్ని జప్తు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జంతువులను దత్తత తీసుకునే వ్యక్తుల గురించి ఆశ్రమ నిర్వాహకులు పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు.
చైనాలో కుక్క మాంసం తినడం నిషేధం. ప్రభుత్వం 2020లో నిబంధనలు కఠినతరం చేసింది. దక్షిణ చైనాలోని షెన్‌జెన్ నగరం 2020లో కుక్కలు, పిల్లులను తినడాన్ని నిషేధించిన మొదటి నగరాల్లో ఒకటి. ఉల్లంఘించినవారికి జరిమానాలు భారీగా ఉంటాయి. ఫిబ్రవరి ఇదే విధంగా హైవే కార్మికులు ఓ పెంపుడు కుక్కను వండుకుని తిన్న ఘటనలో భారీగా జరిమాన విధించారు.
