AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

King Cobra: రాచనాగును ఇంత దగ్గరిగా ఎప్పుడైనా చూశారా మావ..!

పిల్లి, కుక్క పిల్లల వీడియోలు ఎప్పుడూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిని దగ్గరికి తీసుకుని ముద్దు చేస్తూ కొందరు మురిసిపోతూ ఉంటారు. అయితే కింగ్ కోబ్రాతో క్లోజ్‌గా మూవ్ అవ్వడం అంత ఈజీ అంటారా..? ఇది పెంపుడు పామో, లేదో తెలియదు కానీ ఈ పర్సన్ మాత్రం దానితో చాలా దగ్గరిగా మెసులుతున్నారు.

King Cobra: రాచనాగును ఇంత దగ్గరిగా ఎప్పుడైనా చూశారా మావ..!
King Cobra
Ram Naramaneni
|

Updated on: May 21, 2025 | 7:13 PM

Share

ఇటీవల మీరు కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలు చాలా చూసి ఉంటారు. అందులోనూ వాటి మేటింగ్ సీజన్ కావడంలో అవి ఎక్కడ చూసినా జతలుగా సయ్యాటలు ఆడుతూ కనిపించాయి. అయితే అంత పెద్ద పామును మీరెప్పుడైనా క్లోజ్‌గా చూశారా..? వామ్మో అంత సాహసం ఎవరైనా చేస్తారా.. అంటారు. అందుకోసమే మీ ముందుకు ఈ వీడియోను తీసుకొచ్చాం. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, ఇందులో కింగ్ కోబ్రాను దగ్గరగా తాకుతూ కనిపిస్తున్నాడు. ఈ వీడియోను ‘A King Cobra Upclose’ అనే క్యాప్షన్‌తో X లో షేర్ చేశారు. కింగ్ కోబ్రా భారతదేశంలోనే పొడవైన విషపూరిత సర్పం. దాని కాటు ప్రాణాంతకమైంది. అందువల్ల సాధారణంగా ప్రజలు దాని దగ్గరికి వెళ్లడానికి భయపడతారు. కానీ ఇతను దానికి అతి సమీపంగా ఉండి దానితో ఆడుకుంటున్నాడు.

వీడియో దిగువన చూడండి…

ఈ వీడియోపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వారు ” ఫోన్ లో చూస్తున్నా…  పాము చాలా దగ్గరగా వస్తుండటంతో భయంగా ఉంది”, “అమ్మ బాబాయ్.. ఇతను ఆ భారీ పామును ఎలా తాకుతున్నాడు?”, “ఇది ఇంట్లో పెంచిన పామా?” వంటి కామెంట్స్ చేస్తున్నారు.

కింగ్ కోబ్రా ప్రపంచంలోనే పొడవైన విషపూరిత పాము. ఇది గరిష్టంగా 18 అడుగుల (5.5 మీటర్లు) పొడవు వరకు పెరుగుతుంది. అయితే, సాధారణంగా మన ఎజెన్సీ ప్రాంతాల్లో కనిపించేవి 10-13 అడుగుల మధ్య ఉంటాయి.  కింగ్ కోబ్రా విషం అత్యంత ప్రబలమైనది కాదు, కానీ ఒక్క కాటు ద్వారా 400-500 మిల్లీగ్రాముల వరకు విషాన్ని విడుదల చేస్తుంది. ఇది సుమారు 20 మందిని లేదా ఏనుగును కూడా చంపగలదు. విషం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించి, శ్వాస ఆగిపోవడానికి దారితీస్తుంది. ఆడ కింగ్ కోబ్రా గూడు నిర్మించి.. 7 నుంచి 43 గుడ్లను పెట్టి వాటిని కాపాడుతుంది. కింగ్ కోబ్రా సాధారణంగా మనుషులపై అటాక్ చేయదు. కానీ, ప్రమాదం అనిపించినప్పుడు, దాని శరీరాన్ని పైకి ఎత్తి, పడగ విప్పి గర్జన వంటి శబ్దాన్ని చేస్తుంది. దీనిని హెచ్చరికగా భావించాలి.