పాక్ కాల్పుల్లో మహిళ మృతి.. మరో ఇద్దరు పౌరులకు గాయాలు..
పాకిస్థాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. నిత్యం సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. కాల్పులకు తెగబడుతోంది. తాజాగా బుధవారం నాడు పూంచ్, కుప్వారా జిల్లాలోని పలు ప్రాంతాల్లోని..
పాకిస్థాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. నిత్యం సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. కాల్పులకు తెగబడుతోంది. తాజాగా బుధవారం నాడు పూంచ్, కుప్వారా జిల్లాలోని పలు ప్రాంతాల్లోని సరిహద్దుల వెంట కాల్పులకు దిగింది. ఈ క్రమంలో పూంచ్ జిల్లాలోని బాలాకోట్ సెక్టార్ మీదుగా జరిగిప కాల్పుల్లో ఓ మహిళ మరణించింది. మరోకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇక మోంధర్ సెక్టార్ మీదుగా తెల్ల వారుజామున 2.00 గంటల ప్రాంతంలో కాల్పులకు తెగబడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం.. పాక్‌కు ధీటుగా సమాధానం ఇవ్వడంతో.. 2.45 గంటలకు పాక్ తొకముడిచింది.
ఇక కుప్వారా ప్రాంతంలో కూడా బుధవారం నాడు తంగ్‌ధార్ సెక్టార్ మీదుగా పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు.
Pakistan initiated an Unprovoked Ceasefire Violation (CFV) along the LoC in Tangdhar Sector, Kupwara, North Kashmir today in the afternoon hours by firing mortars and other weapons. Befitting response being given. Two civilians injured: Chinar Corps, Indian Army
— ANI (@ANI) July 8, 2020