లాక్‌డౌన్ మరో 7 రోజులు పొడిగింపు.. దీదీ కీలక నిర్ణయం

Bengal Lockdown Extended 7 Days : రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటంతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ ను మరో 7 రోజులపాటు పొడిగించినట్లుగా ప్రకటించారు. ఒక్కరోజే 25 మంది కరోనాతో మరణించడంతో బెంగాల్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న కంటైన్మైంట్‌ జోన్ల్‌లో లాక్‌డౌన్‌ను పోడగించాలని నిర్ణయించుకున్నామని దీదీ తెలిపారు. గురువారం(జూన్ 09) సాయంత్రం 5 గంటల నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వస్తుందని […]

లాక్‌డౌన్ మరో 7 రోజులు పొడిగింపు.. దీదీ కీలక నిర్ణయం
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 08, 2020 | 8:03 PM

Bengal Lockdown Extended 7 Days : రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటంతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ ను మరో 7 రోజులపాటు పొడిగించినట్లుగా ప్రకటించారు.

ఒక్కరోజే 25 మంది కరోనాతో మరణించడంతో బెంగాల్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న కంటైన్మైంట్‌ జోన్ల్‌లో లాక్‌డౌన్‌ను పోడగించాలని నిర్ణయించుకున్నామని దీదీ తెలిపారు. గురువారం(జూన్ 09) సాయంత్రం 5 గంటల నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వస్తుందని దీదీ స్పష్టం చేశారు.

ఇక ఒక్కరోజే 850 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 23,837కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,243 యాక్టివ్ కేసులు ఉండగా వాటిలో 555 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నిన్న చోటుచేకున్న 25 కోవిడ్‌ మరణాలతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 807కు చేరుకుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.