అసోంలో భారీగా పట్టుబడ్డ ఆయుధాలు
అసోంలో భారీగా ఆయుధాలు పట్టుబడ్డాయి. ఇంపాల్ జిల్లాలోని లంగ్తాబల్ ప్రాంతంలో అసోం రైఫిల్స్, స్థానిక పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని..

అసోంలో భారీగా ఆయుధాలు పట్టుబడ్డాయి. ఇంపాల్ జిల్లాలోని లంగ్తాబల్ ప్రాంతంలో అసోం రైఫిల్స్, స్థానిక పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన బుధవారం నాడు చోటుచేసుకుంది. ఈ విషయాన్ని అసోం రైఫిల్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ తెలిపారు. కాగా, గత కొద్ది రోజులుగా ఇక్కడ తీవ్ర వాదుల అలజడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు నిత్యం కూంబింగ్ చేపడుతున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంటున్నారు.
Manipur: A joint team of Assam Rifles and the police recovered a cache of arms and ammunition near Langthabal in Imphal West district yesterday, says Inspector General of Assam Rifles (South) pic.twitter.com/6NSJBaJqtd
— ANI (@ANI) July 8, 2020



