Kuno National Park: కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుతపులి మృతి.. ఇప్పటి వరకు 10 చిరుతలు మృత్యువాత
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుతపులి మృతి చెందింది. ఈ విషయాన్ని పార్క్ అధికారులు ధృవీకరించారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన శౌర్య అనే చిరుత కునో నేషనల్ పార్క్‌లో చనిపోయిందని చెబుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చిరుత మృతి చెందినట్లు లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో అపస్మారక స్థితిలో..
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుతపులి మృతి చెందింది. ఈ విషయాన్ని పార్క్ అధికారులు ధృవీకరించారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన శౌర్య అనే చిరుత కునో నేషనల్ పార్క్‌లో చనిపోయిందని చెబుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చిరుత మృతి చెందినట్లు లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న శౌర్యను అటవీ అధికారులు గుర్తించారు. వెంటనే చికిత్స అందించేందుకు యత్నించినా శౌర్య ప్రాణాలు కాపాడలేకపోయారు.
చిరుతపులి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోస్ట్‌మార్టం తర్వాత మాత్రమే తెలుస్తాయని అధికారులు తెలిపారు. చిరుత ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచి కునో నేషనల్ పార్క్‌లో శౌర్యతో సహా 10 చిరుతలు చనిపోయాయి. 2022లో దక్షిణాఫ్రికాలోని నమీబియా నుంచి వీటిని తీసుకొచ్చారు. చిరుత ప్రాజెక్ట్‌లో భాగంగా సెప్టెంబర్ 17న నమీబియా నుంచి శౌర్యను ఇక్కడికి తీసుకువచ్చారు. నమీబియా నుంచి మొత్తం 8 చిరుతపులిలను తీసుకొచ్చారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను కూడా తీసుకొచ్చారు. భారతదేశంలో పూర్తిగా అంతరించిపోయిన ఈ జాతిని కాపాడేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. కునో నేషనల్ పార్క్‌లో మొత్తం 20 చిరుతపులులను వదిలారు.
ఇప్పటివరకు 10 మరణాలు
కునో నేషనల్ పార్క్‌లో వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు మొత్తం 10 చిరుతలు చనిపోయాయని మీకు తెలియజేద్దాం. మరణించిన 10 చిరుతపులిలలో, కునో పార్క్‌లోనే జన్మించిన మూడు పిల్లలు కూడా ఉన్నాయి. ఆడ చిరుత జ్వాల కునో పార్క్‌లోనే 4 పిల్లలకు జన్మనిచ్చింది. వీటిల్లో మూడు వేర్వేరు కారణాలతో చనిపోయాయి. వాటిల్లో ఒక పులి పిల్ల పార్క్‌లో ఉంది. అది పూర్తి ఆరోగ్యంగా ఉంది. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్‌లో చిరుతల సంఖ్య 17. వాటిల్లోఆరు మగ, ఏడు ఆడ, నాలుగు పిల్లలు ఉన్నాయి.
ప్రాజెక్ట్ చిరుత
2022 సెప్టెంబర్ 17న ప్రాజెక్ట్ చిరుతను భారత ప్రభుత్వం ప్రారంభించింది. అంతరించి పోతునన చిరుతలను కాపాడేందుకు దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు చిరుతలను తరలించారు. 1952లో భారతదేశంలో చిరుతలు అంతరించిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించబడింది. దేశంలో చిరుతల సంఖ్యను పెంపొందించడమే ప్రాజెక్ట్ చీతా ముఖ్య లక్ష్యం.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.