AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cigarettes Sharing: సిగరేట్‌ షేరింగ్‌లో బెడిసిన యవ్వారం.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

దమ్ముకొట్టడం, మందు తాగడం నేటి తరానికి ఓ ఫ్యాషన్‌. ఫ్రెండ్స్‌ అయితే ఒకటే సిగరెట్‌ను షేర్‌ చేసుకుంటూ లాగించేస్తారు. ఒక్కొక్కరు ఒక్కోటైప్‌లో పఫ్స్‌ కొడతారు. కొందరు ఛాన్స్‌ దొరికిందికదా అని ఎక్కువలాగించేసి, మిగిలింది పక్కవారికి షేర్‌ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో..

Cigarettes Sharing: సిగరేట్‌ షేరింగ్‌లో బెడిసిన యవ్వారం.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
Cigarettes Sharing
Srilakshmi C
|

Updated on: Mar 24, 2023 | 7:33 PM

Share

దమ్ముకొట్టడం, మందు తాగడం నేటి తరానికి ఓ ఫ్యాషన్‌. ఫ్రెండ్స్‌ అయితే ఒకటే సిగరెట్‌ను షేర్‌ చేసుకుంటూ లాగించేస్తారు. ఒక్కొక్కరు ఒక్కోటైప్‌లో పఫ్స్‌ కొడతారు. కొందరు ఛాన్స్‌ దొరికిందికదా అని ఎక్కువలాగించేసి, మిగిలింది పక్కవారికి షేర్‌ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో వాళ్ల మధ్య సరదాగా గొడవలుపడ్డా.. పోనీలే మన ఫ్రెండే కదా అని సర్దుకుంటుంటారు. ఐతే బెంగళూరు ఇలాంటి యవారం బెడిసికొట్టి ఒకరి ప్రాణం తీసేంత సీరియస్‌ అయ్యింది. వివరాల్లోకెళ్తే..

బెంగళూరులోని కలబురగి జిల్లాకు చెందిన మల్లినాథ్ బిరాదర్ (36) అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. అదే హోటల్‌లో గణేశ్ అనే వ్యక్తి కూడా అతనితోపాటు పని చేస్తున్నాడు. వీరిద్దరూ బుధవారం సాయంత్రం బయటికి వెళ్లి ఓ సిగరెట్ కొనుగోలు చేసి షేరింగ్‌ చేసుకుంటూ స్మోకింగ్‌ చేశారు. సిగరెట్ షేరింగ్ విషయంలో ఆ ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఒకరిపై మరొకరు దాడి చేసుకునేంతగా ముదిరిపోయింది. వీరితోపాటు పనిచేసే మంజునాథ్‌ మధ్యలో కల్పించుకుని సర్దిచెప్పాడు. దీంతో ఇద్దరూ ఎవరిదోవన వాళ్లు వెళ్లిపోయారు.

ఈ విషయంపై గణేశ్ మరుసటి రోజు సాయంత్రం 6:30 గంటలకు మల్లినాథ్‌ వద్ద ప్రస్తావించాడు. దీంతో వీరిద్దరి మధ్య మరోసారి గొడవ మొదలైంది. ఈ క్రమంలో గణేష్‌ అక్కడే ఉన్న కత్తితో మల్లినాథ్‌ కడుపులో పొడిచాడు. ఈక్రమంలో అక్కడే ఉన్న మంజునాథ్ అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనితోపాటు, గణేష్‌కు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మల్లినాథ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.