Covid-19 vaccine: రక్షణ కవచంలా కోవిడ్ వ్యాక్సిన్.. ఒక్క డోసు తీసుకున్నా.. మరణం నుంచి గట్టెక్కినట్లే..
ICMR on Coronavirus vaccine: దేశంలో కరోనావైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్

ICMR on Coronavirus vaccine: దేశంలో కరోనావైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య.. మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ ఒకటే ప్రధాన అస్త్రమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. అయితే కోవిడ్ మరణాలను నివారించడంలో వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేస్తున్నాయి. వ్యాక్సిన్ సింగిల్ డోస్‌తో 96.6 శాతం, రెండు డోస్‌తో 97.5 శాతం మరణాలను నివారించవచ్చని కేంద్రం వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం మహమ్మారి బారిన పడినా.. ఎక్కువ ప్రమాదం ఉండదని.. ముప్పు తక్కువేనని.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చీఫ్ బలరాం భార్గవ తెలిపారు.
గత ఏప్రిల్ 18 నుంచి ఆగస్టు 15 వరకు సేకరించిన చేపట్టిన అధ్యయనం ప్రకారం.. మహమ్మారి మరణాలను కోవిడ్ వ్యాక్సిన్లు చాలామేరకు నివారిస్తున్నట్లు బలరాం భార్గవ పేర్కొన్నారు. అన్ని వయస్సుల వారికి వ్యాక్సిన్ల నుంచి రక్షణ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా.. కరోనా సెకండ్ వేవ్‌లో భారీగా మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే సెకండ్ వేవ్‌లో మృత్యువాత పడిన వారిలో అత్యధిక మంది వ్యాక్సిన్ వేసుకోని వారే ఉన్నారని తెలిపారు. కావున అందరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.
ఇదిలాఉంటే.. 18 ఏళ్లు దాటిన వారిలో 58 శాతం మందికి కనీసం సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ అధికారి డాక్టర్ వీకే పాల్ తెలిపారు. మిగతా వారికి వ్యాక్సినేషన్ పూర్తయితే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించగలమని ఆయన పేర్కొన్నారు. వైరస్‌తో పోరాడటానికి వ్యాక్సిన్ రక్షణ కవచంలా పనిచేస్తోందన్నారు. దేశంలో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో ఉందని.. అందరూ సద్వినియోగం చేసుకోవాలని వీకే పాల్ సూచించారు. కోవిడ్ సమయంలో డెంగ్యూ విజృంభిస్తోందని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌లో చాలా మంది పిల్లలు డెంగ్యూతోనే చనిపోయినట్లు వెల్లడించారు.
Also Read: