Sachin Tendulkar: సచిన్ 50వ పుట్టిన రోజున దక్కిన ప్రత్యేక గౌరవం.. ఎక్కడంటే

సచిన్ తెందుల్కర్ అంటే తెలియని వాళ్లు ఎవరూ ఉండరూ. సచిన్ వల్లే ఇండియాలో క్రికెట్‌కి అభిమానులు ఎక్కువయ్యారనే విషయం వాస్తవమే. అయితే ఆయన 50 వ పుట్టిన రోజును పురస్కరించుకుని సోమవారం ప్రముఖ సిడ్నీ క్రికెట్ మైదానంలోని ఓ గేటుకు అతని పేరు పెట్టారు.

Sachin Tendulkar: సచిన్ 50వ పుట్టిన రోజున దక్కిన ప్రత్యేక గౌరవం.. ఎక్కడంటే
Sachin
Follow us
Aravind B

|

Updated on: Apr 25, 2023 | 7:43 AM

సచిన్ తెందుల్కర్ అంటే తెలియని వాళ్లు ఎవరూ ఉండరూ. సచిన్ వల్లే ఇండియాలో క్రికెట్‌కి అభిమానులు ఎక్కువయ్యారనే విషయం వాస్తవమే. అయితే ఆయన 50 వ పుట్టిన రోజును పురస్కరించుకుని సోమవారం ప్రముఖ సిడ్నీ క్రికెట్ మైదానంలోని ఓ గేటుకు అతని పేరు పెట్టారు. భారత్ దాటితే సచిన్ కు అత్యంత ఇష్టమైన మైదానం ఆస్ట్రేలియాలో ఉన్న ఎస్‌సీజీనే. ఇక్కడ ఐదు టెస్టుల్లో సగటున 157 పరుగులతో 785 పరుగులు చేసిన రికార్డు ఉంది. అలాగే అత్యధిక స్కోరు 241 నాటౌట్‌తో పాటు మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. మరోవైపు సిడ్నీలో 277 పరుగుల లారా ఇన్నింగ్స్‌కు 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా మరో గేటుకు ఈ వెస్టిండీస్ ఆటగాడి పేరు పెట్టారు. ఇప్పటికే అక్కడి గేట్లకు బ్రాడ్‌మన్‌, అలన్‌ డేవిడ్‌సన్‌, ఆర్థర్‌ మోరిస్‌ పేర్లు ఉన్నాయి. వీళ్ల సరసనే ఇప్పుడు సచిన్, లారా చేరారు.

ఎస్‌సీజీ ఛైర్మన్‌ రాడ్‌ మెక్‌గియాక్‌, సీఈవో కెర్రీ మాథర్‌, క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈవో నిక్‌ హాక్లీ సమక్షంలో ఈ కొత్త గేట్లను ప్రారంభించారు. ఈ సచిన్‌, లారా గేట్ల నుంచి పర్యాటక జట్టు క్రికెటర్లు మైదానంలోకి ప్రవేశించనున్నారు. లారా, సచిన్‌ ఘనతలు, ఎస్‌సీజీలో వీళ్ల గణాంకాలతో కూడిన ఓ శిలాఫలకాన్ని కూడా ఏర్పాటు చేశారు. భారత్‌ వెలుపల నాకిష్టమైన మైదానం ఎస్‌సీజీనే అని. . ఆస్ట్రేలియాలో నా తొలి పర్యటన (1991-92) నుంచి అక్కడ నాకు గొప్ప జ్ఞాపకాలున్నాయని సచిన్ తెలిపాడు. పర్యాటక క్రికెటర్లు మైదానంలోకి ప్రవేశించే గేట్లకు నాపేరు, లారా పేరు పెట్టడం మాకు దక్కిన గౌరవమని.. ఎస్‌సీజీ, క్రికెట్‌ ఆస్ట్రేలియాకు ధన్యవాదాలని పేర్కొన్నాడు. త్వరలోనే ఎస్‌సీజీకి వెళ్లేందుకు ప్రయత్నిస్తానన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..