Flight: విమానంలో హద్దు మీరుతున్న మూత్ర విసర్జన ఘటనలు.. తాజాగా మళ్లీ ఇప్పుడు
ఇటీవల విమానంలో తోటీ ప్రయాణికలపైనే మూత్ర విసర్జన చేయడం లాంటి ఘటనలకు హద్దు లేకుండా పోతుంది. ఇప్పడు తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.

ఇటీవల విమానంలో తోటీ ప్రయాణికలపైనే మూత్ర విసర్జన చేయడం లాంటి ఘటనలకు హద్దు లేకుండా పోతుంది. ఇప్పడు తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఆదివారం రోజున న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న AA 292 అనే అమెరినకన్ ఏయిర్‌లైన్స్ విమానంలో ఓ వ్యక్తి తప్పతాగి మరో వ్యక్తిపై మూత్ర విసర్జన చేయడం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని ఫ్లైట్ సిబ్బంది అధికారుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ విమానం ఉదయం 9.00 గంటలకు న్యూఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇంటర్నేషల్ ఎయిర్‌పోర్టులో దిగగానే పోలీసులు ఆ ప్రయాణికుడ్ని అరెస్టు చేశారు.
గతంలో విమానంలో ఇలాంటి మూత్ర విసర్జన ఘటనలు రెండు జరగగా ఇది మూడవది. గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న విమానంలో ఓ వ్యక్తి.. 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగుచూడటం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అలాగే డిసెంబర్ 6, 2022 న ప్యారిస్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఏయిర్ ఇండియా విమానంలో ఓ మహిళకు చెందిన వాష్ రూంకు వెళ్లినప్పుడు తన సీటు, దుప్పటిలో మరో వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..