AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HMDA Layouts: హైదరాబాద్‌లో అమ్మకానికి హెచ్ఎండీఏ ప్లాట్లు.. నోటిఫికేషన్ జారీ.. వేలం ఎప్పుడంటే..

హైదరాబాద్ మహనగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రభుత్వ స్థలాల్లో అభివృద్ధి చేసిన మరికొన్ని ప్లాట్లను విక్రయించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌ శివారులోని బాచుపల్లి, మేడిపల్లిలో ఉన్న ప్రభుత్వ ప్లాట్లను విక్రయించనున్నట్లు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వెల్లడించింది.

HMDA Layouts: హైదరాబాద్‌లో అమ్మకానికి హెచ్ఎండీఏ ప్లాట్లు.. నోటిఫికేషన్ జారీ.. వేలం ఎప్పుడంటే..
Hmda Layouts
Shaik Madar Saheb
|

Updated on: Apr 25, 2023 | 7:45 AM

Share
హైదరాబాద్ మహనగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రభుత్వ స్థలాల్లో అభివృద్ధి చేసిన మరికొన్ని ప్లాట్లను విక్రయించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌ శివారులోని బాచుపల్లి, మేడిపల్లిలో ఉన్న ప్రభుత్వ ప్లాట్లను విక్రయించనున్నట్లు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వెల్లడించింది. బాచుపల్లిలో 133 ప్లాట్లు, అలాగే మేడిపల్లిలో 85 ప్లాట్లకు వచ్చే నెల 22 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని బాచుపల్లిలో 27 ఎకరాలు, మేడిపల్లిలో 55 ఎకరాల ప్రభుత్వ స్థలంలో హెచ్‌ఎండీఏ భారీ లేఅవుట్లను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.
అయితే, వీటికి మార్చిలో మొదటి విడత కింద కొన్ని ప్లాట్లను విక్రయించగా కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా రెండో విడతలో భాగంగా రెండు లేఅవుట్లలోని ప్లాట్లను విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ ప్రకారం.. బాచుపల్లిలో చదరపు గజానికి రూ.25 వేలు, మేడిపల్లిలో రూ.32 వేలు చొప్పున హైదరాబాద్ మహనగర అభివృద్ధి సంస్థ ధరలను నిర్ణయించింది. కనీస బిడ్‌ పెంపుదల చదరపు గజానికి రూ.500 చొప్పున ఉండాలంటూ నోటిఫికేషన్‌లో స్పష్టంచేసింది.
ఈ రెండు లే అవుట్లకు సంబంధించి మరింత సమాచారం కోసం హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌, ఎంఎస్‌టీసీ ఈ-కామర్స్‌, ఎంఎస్‌టీసీ ఇండియా వెబ్‌సైట్లను సందర్శించాలని తెలిపింది. లేఅవుట్‌ల సందర్శనకు, సందేహాల నివృత్తి కోసం.. ఫోన్‌ నంబర్లు.. 7396345623, 9154843213లో సంప్రదించాలని హెచ్ఎండీఏ అధికారులు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
యుద్ధంతో 10 మంది ధనిక భారతీయ వ్యాపారవేత్తలపై తీవ్ర ప్రభావం
యుద్ధంతో 10 మంది ధనిక భారతీయ వ్యాపారవేత్తలపై తీవ్ర ప్రభావం
ఇరాన్ ప్రతికార దాడులు.. CBSE 10, 12 తరగతుల పరీక్షలు మళ్లీ వాయిదా!
ఇరాన్ ప్రతికార దాడులు.. CBSE 10, 12 తరగతుల పరీక్షలు మళ్లీ వాయిదా!
సర్కార్ బడిలో వికసించిన ‘గునుగుపూలు’ పరిమళం..!
సర్కార్ బడిలో వికసించిన ‘గునుగుపూలు’ పరిమళం..!
మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన ఆహారంతో క్యాన్సర్ వస్తుందా..?
మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన ఆహారంతో క్యాన్సర్ వస్తుందా..?
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
రవితో రాహువు యుతి.. ఆ రాశుల వారికి కొత్త జీవితం..!
రవితో రాహువు యుతి.. ఆ రాశుల వారికి కొత్త జీవితం..!