AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mann Ki baat: ప్రధాని మోదీ ‘మాన్ కీ బాత్’ ఎంతమంది వింటున్నారో తెలుసా ?

ప్రతినెల చివరి ఆదివారం ప్రధాని మోదీ మన్‌కీ బాత్ పేరుతో నిర్వహించే ఓ ప్రత్యేక కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే. అందులో ఆయన దేశ పురోగతిపై, వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల విజయాలపై.. అలాగే సామాజిక, సాంకేతిక, సైన్యం ఇలా అన్నిరంగాలకు సంబంధించిన విషయాలను తెలియజేస్తారు.

Mann Ki baat: ప్రధాని మోదీ 'మాన్ కీ బాత్' ఎంతమంది వింటున్నారో తెలుసా ?
Pm Modi
Aravind B
| Edited By: |

Updated on: Apr 29, 2023 | 1:25 PM

Share

ప్రతినెల చివరి ఆదివారం ప్రధాని మోదీ మన్‌కీ బాత్ పేరుతో నిర్వహించే ఓ ప్రత్యేక కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే. అందులో ఆయన దేశ పురోగతిపై, వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల విజయాలపై.. అలాగే సామాజిక, సాంకేతిక, సైన్యం ఇలా అన్నిరంగాలకు సంబంధించిన విషయాలను తెలియజేస్తారు. అయితే మరీ ఈ మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని ఎంతమంది వింటున్నారో తెలుసా ?. ఈ విషయాన్నే రోహ్‌తక్‌లోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌’ (ఐఐఎం) తమ అధ్యయనంలో వెల్లడించింది. ప్రతి నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమాన్ని దాదాపు 23 కోట్ల మంది వినేవారు ఉన్నారని.. వారిలో 65 శాతం మంది హిందీలో ఉంటున్నారని తెలిపింది. అలాగే 44.7% మంది దీనిని టీవీ ఛానళ్లలో వింటున్నారని పేర్కొంది.

వచ్చే ఆదివారంతో ఈ కార్యక్రమం 100 నెలలు పూర్తి చేసుకోనుంది. దాదాపు 100 కోట్ల మంది ప్రజలు ఒక్కసారైనా ఈ కార్యక్రమాన్ని విన్నారని, 41 కోట్ల మంది అప్పుడప్పుడు వింటున్నారని ఐఐఎం రోహ్‌తక్‌ డైరెక్టర్‌ ధీరజ్‌ పి.శర్మ తెలిపారు. 22 భారతీయ భాషలు, 29 మాండలికాలతో పాటు చైనీస్‌, అరబిక్‌, ఫ్రెంచ్‌ వంటి 11 విదేశీ భాషల్లోనూ ఈ కార్యక్రమం ప్రసారమవుతోందని ప్రసారభారతి సీఈవో గౌరవ్‌ ద్వివేది పేర్కొన్నారు. దాదాపు 10వేల మందిపై ఈ సర్వే నిర్వహించారు. ప్రభుత్వ పనితీరు, దేశ పురోగతిపై వీరిలో సుమరు 73% మంది ఆశాభావంతో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని 59% మంది తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?