కేసుల నిర్ధారణలో సోషల్ మీడియా ట్రయల్స్ ప్రామాణికం కావు.. జడ్జీలకు సీజేఐ జస్టిస్ ఎన్ .వి. రమణ హితవు

సోషల్ మీడియాలో విస్తృతంగా వచ్చే ప్రజాభిప్రాయాలను జడ్జీలు ప్రాతిపదిక గానో, ప్రామాణికం గానో తీసుకోరాదని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు.

కేసుల నిర్ధారణలో సోషల్ మీడియా ట్రయల్స్ ప్రామాణికం కావు.. జడ్జీలకు సీజేఐ జస్టిస్  ఎన్ .వి. రమణ హితవు
N. V. Ramana
Umakanth Rao

| Edited By: Phani CH

Jul 01, 2021 | 1:29 PM

సోషల్ మీడియాలో విస్తృతంగా వచ్చే ప్రజాభిప్రాయాలను జడ్జీలు ప్రాతిపదిక గానో, ప్రామాణికం గానో తీసుకోరాదని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. అదేపనిగా ‘గళమెత్తే శబ్దాలు’ ఎన్నడూ ఏది సరైనదన్న విషయాన్ని నిర్ధారించలేవని ఆయన చెప్పారు. ‘రూల్ ఆఫ్ లా’ పై బుధవారం జస్టిస్ పీ.డీ.దేశాయ్ మెమోరియల్లెక్చర్ ఇచ్చిన సందర్బంగా..ఆయన ఈ సూచనలు చేశారు. సామాజిక మీడియాకు ఎప్పటికప్పుడు విస్తృతి అయ్యే సామర్థ్యం ఉందని..కానీ ఇది ఏది రైటో..ఏది కాదో..ఏది మంచో, ఏది చెడో, ఏది రియల్, ఏది ఫేక్ అన్న దాన్ని వేర్వేరుగా చూడజాలదని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే మీడియా ట్రయల్స్ అన్న దాన్ని న్యాయమూర్తులు తమ కేసులను నిర్ణయించేటప్పుడు గైడింగ్ ఫ్యాక్టర్స్ గా తీసుకోరాదని ఆయన సూచించారు. ఎగ్జిక్యూటివ్ (ప్రభుత్వం) నుంచి ఎంతో ఒత్తిడి వస్తుంటుందని…ఇదే సమయంలో సోషల్ మీడియా ట్రెండ్స్ ఆయా సంస్థలపై ప్రభావం చూపుతాయా అన్న అంశాన్ని పరిశీలించడం అనివార్యమని ఆయన చెప్పారు. కానీ అంతమాత్రాన జరుగుతున్న వాస్తవాలపై జడ్జీలు గానీ జుడీషియరీ గానీ పూర్తిగా దూరం కారాదని జస్టిస్ రమణ పేర్కొన్నారు.

జుడీషియరీ, శాసన వ్యవస్థ తదితరాలపై న్యాయమూర్తులకు పూర్తి అవగాహన ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తీర్పుల ప్రభావాన్ని కూడా వీరు అంచనా వేయగలిగి ఉండాలన్నారు. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జుడీషియరీ ..ఈ మూడింటికీ రాజ్యాంగంలో సమాన పాత్ర ఉందని పేర్కొన్నారు. కానీ ఇదే సమయంలో జుడీషియరీకి పూర్తి స్వేచ్ఛ ఉండాలని..దీనిపై ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎవరూ కంట్రోల్ చేయజాలరన్నారు. అది ప్రభుత్వ లేదా శాసన వ్యవస్థ అయినా కావచ్చు అని వివరించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: చైనాను ఎవరూ శాసించలేరు… ఆ శకం అంతమైంది… కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల్లో అధ్యక్ధుడు జీ జిన్ పింగ్

Covishield Vaccine: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ఇండియన్‌ స్టూడెంట్స్‌కు గుడ్‌ న్యూస్‌..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu