NTPC డిప్యూటీ జనరల్ మేనేజర్ దారుణ హత్య! నడిరోడ్డుపై కాల్చి చంపారు..
జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కుమార్ గౌరవ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో గౌరవ్‌పై మూడు రౌండ్లు కాల్పులు జరిగాయి. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనతో NTPC ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) డిప్యూటీ జనరల్ మేనేజర్ కుమార్ గౌరవ్‌ను కాల్చి చంపారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం ఉదయం గుర్తు తెలియని దుండగులు డీజీఎం గౌరవ్‌పై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. హజారీబాగ్‌లోని ఆరోగ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ సంఘటన హజారీబాగ్‌లోని కట్కమ్‌డాగ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఫతాహా సమీపంలో జరిగింది. ఈ సంఘటన జరిగిన వెంటనే NTPC ఉద్యోగులు అనేక మంది ఆరోగ్యమ్ ఆసుపత్రికి చేరుకుని భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హజారీబాగ్ ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.
NTPC కోల్ మైనింగ్ నేఫీ అధ్యక్షుడు కమలా రామ్ రాజక్ తెలిపిన వివరాల ప్రకారం, కుమార్ గౌరవ్ హజారీబాగ్‌లోని కెరెదారిలో ఉన్న NTPC కోల్ డిస్పాచ్ ప్రాజెక్ట్‌కు DGMగా వ్యవహరిస్తున్నారు. కుమార్ గౌరవ్ హజారీబాగ్‌లోని తన నివాసం నుండి కెరెదారి కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో ఫతా గ్రామం సమీపంలో ఆయన కారును దుండగులు ఓవర్‌టేక్ చేసి ఆయనను కాల్చి చంపారని తెలిపారు. గౌరవ్ కంపెనీ వాహనంలోనే ఆఫీస్‌కు బయలుదేరారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆయన కారు కట్కమ్‌డాగ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఫతా గ్రామానికి చేరుకోగానే, బైక్‌పై వచ్చిన దుండగులు ఆయన కారును అడ్డగించి ఆయనపై కాల్పులు జరిపినట్లు పోలీసులు కూడా తెలిపారు. ఈ కాల్పుల సంఘటనతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
हजारीबाग में NTPC के DGM का मर्डर, ऑफिस जाते वक्त गोलियों से भूना; दहशत में लोग#Jharkhand #Hazaribagh #NTPC #DGM https://t.co/NNpu0wY8vk
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) March 8, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
