AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel Lady: భారత పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్‌ మహిళపై అత్యాచారం! ఉమెన్స్‌ డే నాడే..!

కర్ణాటకలోని హంపి సమీపంలోని సనపూర్ సరస్సు వద్ద ఇజ్రాయెల్ పర్యాటకురాలు, హోమ్‌స్టే మేనేజర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ దాడిలో ఒడిశాకు చెందిన పర్యాటకుడు కాలువలో పడి మిస్సింగ్ అయ్యాడు. మరో ఇద్దరు పురుషులు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.

Israel Lady: భారత పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్‌ మహిళపై అత్యాచారం! ఉమెన్స్‌ డే నాడే..!
Israel Lady Rape
SN Pasha
|

Updated on: Mar 08, 2025 | 1:40 PM

Share

మనదేశంలో పర్యటించి, ఇక్కడ అందమైన ప్రదేశాలతో పాటు మన సంస్కృతి, సంప్రదాయలను తెలుసుకుందామని వచ్చిన ఓ ఇజ్రాయెల్‌ మహిళపై దారుణం జరిగింది. ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు ఆత్యాచారానికి పాల్పడ్డారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం నాడే ఈ ఘటన వెలుగు చూడటంతో దేశం తలదించుకునే పరిస్థితి వచ్చింది. కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం హంపిలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో మరో దారుణం ఏంటంటే.. ఇజ్రాయెల్‌ మహిళతో పాటు మరో మహిళపై అత్యాచారం చేసి, వారితో పాటు ఉన్న ఓ పర్యాటకుడిని కొట్టి నదిలో పడేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 11 నుంచి 11:30 గంటల మధ్య గుర్తు తెలియని దుండగులు హంపి సమీపంలోని ప్రసిద్ధ సనపూర్ సరస్సు ఒడ్డున ఉన్న 27 ఏళ్ల ఇజ్రాయెల్ మహిళా పర్యాటకురాలు, 29 ఏళ్ల హోమ్‌స్టే మేనేజర్‌పై అత్యాచారం చేశారు. నేరం జరిగిన సమయంలో వారిద్దరితో పాటు ఉన్న ఒడిశాకు చెందిన ఓ పర్యాటకుడిని కొట్టి తుంగభద్ర కాలువలోకి నెట్టడంతో అతను నదిలో కొట్టుకపోయాడు. అతని మృతదేశం శనివారం సాయంత్రం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అమెరికా, మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరు పురుష పర్యాటకులు కూడా దుండగుల దాడిలోగాయపడ్డారు. వారి నుంచి ఎలాగోలా ప్రాణాలతో బయటపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. నేరం జరిగిన ప్రదేశం హంపి నుండి 4 కి.మీ దూరంలో ఉందని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతానికి విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. గంగావతి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో 309 (6), 311, 64, 70 (1), 109 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ ప్రకారం, నలుగురు పర్యాటకులు, వారు బస చేసిన హోమ్‌స్టే మహిళా మేనేజర్ సనపూర్ సరస్సు దగ్గర సంగీతం ప్లే చేస్తూ ఆనందిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?