Wine: వైన్ ప్రియులకు ఆ రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్.. ఇక కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లలో ..
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో వైన్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని కిరాణా దుకాణాలు(Kirana shops), సూపర్ మార్కెట్లలో(supermarkets ) వైన్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. వెయ్యి చదరపు అడుగుల కంటే పెద్దదిగా ఉండే అన్ని సూపర్ మార్కెట్లలో అమ్మడానికి అవకాశం కల్పిచారు. అక్కడ స్టాల్ ఏర్పాటు చేసి వైన్ విక్రయానికి అనుమతిస్తారు. అయితే పదేళ్ల క్రితం నాటి ప్రతిపాదన ఇది అని తెలిపింది. ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలోని కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో త్వరలో మద్యం అందుబాటులోకి రానుంది. అయితే సూపర్ మార్కెట్లలో వైన్ మాత్రమే విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అనుమతించింది.
ప్రతిపక్షాల విమర్శలు..
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అందులో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రైతుల ఉత్పాదకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహా సర్కార్ వెల్లడించింది. ఆ వివరాలను ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. అయితే మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి విమర్శిచడాన్ని ఆయన తప్పుబట్టారు. సూపర్ మార్కెట్లలో వైన్ విక్రయాలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1,000 చదరపు అడుగుల వరకు ఉన్న సూపర్ మార్కెట్లలో వైన్ విక్రయాలను అనుమతించనున్నట్లు నవాబ్ మాలిక్ తెలిపారు.
రైతుల ఉత్పత్తికి ఊతం లభిస్తుంది
అదనంగా ద్రాక్ష రైతుల ఉత్పత్తిపై రాష్ట్రం నడుస్తుందని మాలిక్ అన్నారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నిర్ణయం సూపర్ మార్కెట్‌లో స్టాల్ షోకేస్ కానుంది. గోవా, హిమాచల్‌లో కూడా బీజేపీ అదే విధానం అనుసరిస్తోందని అభిప్రయా పడ్డారు. ఆయన హయాంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో బీజేపీ మద్యం విక్రయ విధానాన్ని అవలంబించింది. అయితే, ఇక్కడ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: PRC: చర్చలకు రండి.. మీరు మా శత్రువులు కాదు.. ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల సూచన..
TATA – Air India: ఎగిరిపో ఆకాశమే హద్దుగా.. టాటా గ్రూప్ చేతికి చేరిన ఎయిరిండియా..