AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: యూపీఐ పేమెంట్స్ చేసుకోలేకపోతున్నారా.. మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉందా.. అయితే ఈ వివరాలు మీ కోసమే

డిజిటల్ పేమెంట్స్ లో యూపీఐ(UPI) కీలక పాత్ర వహిస్తుంది. నగదు లావాదేవీలు చేసుకునేందుకు ఈ పద్ధతి చాలా బాగా ఉపయోగపడుతోంది. ప్రస్తుతం డెబిట్ కార్డ్ (Debit Card) ఉన్నవారికే ఈ సేవలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో డిజిటల్ చెల్లింపులను..

UPI Payments: యూపీఐ పేమెంట్స్ చేసుకోలేకపోతున్నారా.. మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉందా.. అయితే ఈ వివరాలు మీ కోసమే
Aadhar
Ganesh Mudavath
|

Updated on: Mar 17, 2022 | 10:00 PM

Share
డిజిటల్ పేమెంట్స్ లో యూపీఐ(UPI) కీలక పాత్ర వహిస్తుంది. నగదు లావాదేవీలు చేసుకునేందుకు ఈ పద్ధతి చాలా బాగా ఉపయోగపడుతోంది. ప్రస్తుతం డెబిట్ కార్డ్ (Debit Card) ఉన్నవారికే ఈ సేవలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో డిజిటల్ చెల్లింపులను (Digital Payments) పెంచేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో ముందడుగు వేసింది. ఆధార్ ఓటీపీ (Aadhar OTP) ద్వారా యూపీఐ యాక్టివేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని బ్యాంకులను కోరింది. అంటే డెబిట్ కార్డ్ అవసరం లేకుండా ఆధార్ కార్డ్ ఓటీపీ ద్వారా యూపీఐ యాక్టివేట్ చేసుకోవచ్చన్న మాట. దీని వల్ల డెబిట్ కార్డ్ లేనివాళ్లు కూడా యూపీఐ సేవలను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం ఎవరైనా తమ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించి.. యూపీఐ యాక్టివేట్ చేయాలంటే తప్పనిసరిగా ఏటీఎం కార్డ్ ఉండాలి. తమ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన ఫోన్ నెంబర్, ఏటీఎం కార్డులో చివరి ఆరు అంకెలు ఉంటే చాలు. యూపీఐ యాక్టివేట్ చేయొచ్చు.యూపీఐ పిన్ జనరేట్ చేయాలన్నా, మార్చాలన్నా ఏటీఎం కార్డులో చివరి ఆరు అంకెలు తప్పనిసరి. దీనివల్ల ఏటీఎం కార్డులు లేనివాళ్లు యూపీఏ పేమెంట్స్ చేయలేకపోతున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొత్త విధానంతో డెబిట్ కార్డ్ లేనివాళ్లు, ఏటీఎం కార్డ్ యాక్టీవ్‌గా లేనివాళ్లు కూడా యూపీఐ ప్లాట్‌ఫామ్‌లో చేరొచ్చు. యూపీఐ పిన్ మార్చుకోవచ్చు. దీని కోసం ఆధార్ కార్డ్ ఉంటే చాలు.
2022 మార్చి 15 నుంచి ఆధార్ కార్డ్ ద్వారా యూపీఐ యాక్టివేట్ చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని NPCI కోరింది. యూఐడీఏఐ గైడ్‌లైన్స్ ప్రకారం ఆధార్ ఓటీపీ వేలిడేషన్ జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాసెస్ ఎన్‌పీసీఐ సిస్టమ్స్, బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, థర్డ్ పార్టీ అప్లికేషన్ల దగ్గర ప్రాసెస్‌లో ఉందని, పూర్తి స్థాయిలో ఈ విధానం అమలు కావడానికి 9 నెలల నుంచి 12 నెలల సమయం పట్టొచ్చని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు ప్రతీ ఒక్కరి దగ్గర ఆధార్ నెంబర్ ఉండటంతో, ఆధార్ ఓటీపీ ద్వారా యూపీఐ ప్లాట్‌ఫామ్‌లో చేరడం సులువవుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ పూర్తవుతుంది. వెరిఫికేషన్ పూర్తైన తర్వాత యూపీఐ సేవల్ని ఉపయోగించుకోవచ్చు.
Also Read