AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagadam : ఇప్పటికీ అదే క్రేజ్.. పవర్ ఫుల్ మాస్ మసాలా మూవీకి 15 ఏళ్లు..

థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చిన తర్వాత గుర్తుండే సినిమాలు కొన్ని ఉంటాయి. విడుదలైన కొన్నేళ్ళ తర్వాత కూడా మర్చిపోలేని చిత్రాలు ఉంటాయి.

Jagadam : ఇప్పటికీ అదే క్రేజ్.. పవర్ ఫుల్ మాస్ మసాలా మూవీకి 15 ఏళ్లు..
Jagadam
Rajeev Rayala
|

Updated on: Mar 17, 2022 | 6:58 PM

Share

Jagadam : సుకుమార్. టాలీవుడ్ లో ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా తన క్రియేటివిటీతో టాక్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు సుకుమార్. మొదటి సినిమా జగడం నుంచి రీసెంట్ గా వచ్చిన పుష్ప వరకు సుకుమార్ సినిమాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక సుకుమార్ మొదటి సినిమా జగడం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ‘జగడం’ 2007లో మార్చి 16న విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి పదిహేనేళ్ళు పూర్తయింది. కానీ, సినిమాపై క్రేజ్ ఇంకా తగ్గలేదు. మాస్ సీన్స్, ముఖ్యంగా సుకుమార్ తీసిన హీరో ఎలివేషన్ సీన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ రామ్ యాక్టింగ్ ఇప్పటికీ ప్రేక్షకుల హాట్ ఫేవరెట్. దేవిశ్రీ ప్రసాద్ పాటలు.. మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్ట్‌లో ఉంటాయి. అప్పట్లో స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌ తన సినిమాలకు ఏ కెమెరా ఎక్విప్‌మెంట్ ఉపయోగించారో, ‘జగడం’ సినిమాకూ అదే ఎక్విప్‌మెంట్ ఉపయోగించారట. సూపర్ 35 ఫార్మాట్‌లో షూట్ చేశారు. చాలా మంది టెక్నీషియన్స్‌కు రిఫరెన్స్‌గా నిలిచిన చిత్రమిది.

రామ్‌కు ‘జగడం’ రెండో సినిమా. ఇప్పుడు సినిమా, రామ్ పెర్ఫార్మన్స్ చూస్తే.. కొత్త హీరో చేసినట్టు ఉండదు, ఎంతో ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్న హీరోగా కనిపిస్తారు. ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ మాట్లాడుతూ.. “జగడం చేసే సమయానికి రామ్‌కు 17 ఏళ్ళు. రాలేదని, చేయలేననే మాటలు అతడి నోటి వెంట వినలేదు. ఏం చేయాలని చెప్పినా.పవర్ . పది నిమిషాల్లో ప్రాక్టీస్ చేసి చేసేవాడు. షార్ప్, బ్రిలియెంట్ యాక్టర్. షూటింగ్ చేసేటప్పుడు రామ్‌ను చూస్తే వండర్ బాయ్ అనిపించాడు. ఇండస్ట్రీలో రామ్ మంచి స్థాయికి వస్తాడని అప్పుడే అనుకున్నాను. ఈ రోజు అదే ప్రూవ్ అయ్యింది” అని సుకుమార్ చెప్పారు.

‘పుష్ప’తో సుకుమార్ మాస్ ఏంటనేది పాన్ ఇండియా ప్రేక్షకులకు తెలిసింది. అయితే… తెలుగు ప్రేక్షకులకు సుకుమార్ మాస్ గురించి తెలుసు. ఆల్రెడీ ‘జగడం’ చూశారు కదా! ఇక, రామ్ గురించి నార్త్ ఇండియన్స్, పాన్ ఇండియా ప్రేక్షకులకు ఆల్రెడీ తెలుసు. ఆయన తెలుగు సినిమాలను హిందీలో డబ్బింగ్ చేస్తుంటే మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం ‘ది వారియర్’ చేస్తున్న రామ్, ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ‘జగడం’ రీమేక్ చేస్తే.. నెక్స్ట్ లెవల్ ఉంటుందని చెప్పవచ్చు. “రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. త్వరలో తప్పకుండా చేస్తా. యాక్చువల్లీ.. ఇప్పటి రామ్‌తో మళ్ళీ ‘జగడం’ రీమేక్ చేయాలని ఉంది. ఇప్పటి రామ్‌తో మళ్ళీ జగడం చూసుకోవాలని ఉంది” అని సుకుమార్ చెప్పారు. ఆయన అభిమానులు, రామ్ అభిమానులు, ఇద్దరి అభిమానులు ‘జగడం’ రీమేక్ కోసం వెయిట్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Monal Gajjar: గుచ్చే గులాబీలా కుర్రాళ్ళ గుండెల్లో పూల బాణాలు గుచ్చుతున్న బిగ్ బాస్ బ్యూటీ ‘మోనాల్’…

Sammathame: ప్రేమలో తేలిపోతున్న యంగ్ హీరో.. సమ్మతమే మూవీ నుంచి మరో అందమైన పాట..

Ananya Nagalla: యూత్ న్యూ క్రష్ లిస్ట్ లో చేరిన హీరోయిన్ ‘అనన్య నాగల్ల’ కొత్త ఫొటోస్‌తో యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తున్న బ్యూటీ..

Follow Us
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!