జయప్రదకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
సినీ నటి, బీజేపీ నేత జయప్రదకు యూపీ.. రాంపూర్ లోని కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 ఎన్నికల్లో ఆమె ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసుపై తదుపరి విచారణ ఏప్రిల్ 20 న జరగాలని కోర్టు ఆదేశించింది.
సినీ నటి, బీజేపీ నేత జయప్రదకు యూపీ.. రాంపూర్ లోని కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 ఎన్నికల్లో ఆమె ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసుపై తదుపరి విచారణ ఏప్రిల్ 20 న జరగాలని కోర్టు ఆదేశించింది. నాడు లోక్ సభ ఎన్నికల సందర్భంగా జయప్రద ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించారని కేసు నమోదైంది. ఆ ఎన్నికల్లో రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఆజం ఖాన్ ఆమెపై లక్షా పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించి ఆమెను ఓడించారు.