AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుల్వామా ఘటన.. ఆ ముఠాలో మరో ఇద్దరి అరెస్ట్.. అంతా జైషే మద్దతుదారులే !

జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో బాంబుల తయారీకోసం ఆన్ లైన్ లో కెమికల్స్ వగైరా వస్తువులను కొనుగోలు చేసిన ముఠాలోని మరో ఇద్దరిని ఎన్ ఐ ఏ (జాతీయ దర్యాప్తు బృందం) అరెస్టు చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఆ బాంబులను వినియోగించి ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సీ ఆర్ పీ ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

పుల్వామా ఘటన.. ఆ ముఠాలో మరో ఇద్దరి అరెస్ట్.. అంతా జైషే మద్దతుదారులే !
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 07, 2020 | 11:16 AM

Share

జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో బాంబుల తయారీకోసం ఆన్ లైన్ లో కెమికల్స్ వగైరా వస్తువులను కొనుగోలు చేసిన ముఠాలోని మరో ఇద్దరిని ఎన్ ఐ ఏ (జాతీయ దర్యాప్తు బృందం) అరెస్టు చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఆ బాంబులను వినియోగించి ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సీ ఆర్ పీ ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా శ్రీనగర్ కు చెందిన 19 ఏళ్ళ వైజుల్ ఇస్లామ్ అనే యువకుడిని, పుల్వామాకు చెందిన 32 ఏళ్ళ మహమ్మద్ అబ్బాస్ రాథేర్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు.  దీంతో గత వారం రోజుల్లో అరెస్టయినవారి  సంఖ్య ఐదుకు చేరింది. బాంబుల తయారీ కోసం కెమికల్స్, బ్యాటరీలు, ఇతర వస్తువులను సేకరించేందుకు తాను అమెజాన్ ఆన్ లైన్ షాపింగ్ అకౌంట్ ను వినియోగించానని వైజుల్ ఇస్లామ్ అంగీకరించాడట. పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ టెర్రరిస్టుల నుంచి అందిన ఆదేశాల మేరకు వీటిని కొనుగోలు చేసినట్టు ఆ యువకుడు చెప్పాడు. దాడిలో భాగంగా వీటిని పర్సనల్ గా తాను వారికి అంద జేసినట్టు ఇస్లామ్ తెలిపాడు. ఇక మహమ్మద్ అబ్బాస్ కూడా తక్కువైనవాడేమీ కాదు. జైషే మహమ్మద్ కి చెందిన ఓ టెర్రరిస్టుకు, బాంబుల తయారీలో నిపుణుడైన మహమ్మద్ ఉమర్ అనే వ్యక్తి కి 2018 ఏప్రిల్-మే నెలల్లో ఇతగాడు తన ఇంట్లో ఆశ్రయం కల్పింఛాడట. ఇంకా అదిల్ అహ్మద్ దార్ అనే సూసైడ్ బాంబర్ కి, సమీర్ అహ్మద్ దార్, కమ్రాన్ అనే ఉగ్రవాదులకు కూడా అతడు షెల్టర్ ఇఛ్చినట్టు ఒప్పుకున్నాడు. కాగా-ఈ కేసులో నిందితుడైన తారిఖ్ అహ్మద్ షా, అతని కూతురు ఇన్ షా జాన్ కి కూడా అబ్బాస్ ఆశ్రయం కల్పించాడు. ఈ తండ్రీ కూతుళ్లను ఈ నెల 3 న అరెస్టు చేశారు.

పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14 కు ముందు జరిగిన కుట్రను దర్యాప్తు చేసేందుకు  జాతీయ దర్యాప్తు సంస్థ ఈ కేసును చేపట్టింది.

Follow Us
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు
మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..
మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..
తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!
తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
ప్రతి భార్య భర్తకు చెప్పని 4 విషయాలు ఇవేనా? ఎందుకు దాస్తారో..
ప్రతి భార్య భర్తకు చెప్పని 4 విషయాలు ఇవేనా? ఎందుకు దాస్తారో..
600వ టెస్టులో భారత్ జయభేరి.. గాలేలో సుతార్ సూపర్ షో
600వ టెస్టులో భారత్ జయభేరి.. గాలేలో సుతార్ సూపర్ షో
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న పూజలు చేస్తే చాలు..
గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న పూజలు చేస్తే చాలు..