ఆచితూచి అడుగులేస్తున్న బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య 

11 July  2026

Pic credit - Instagram

Rajeev 

 బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య ఆచి తూచి సినిమాలు చేస్తుంది. మొన్నటి వరకు వరుసగా సినిమాలను లైనప్ చేసిన ఈ అమ్మడి ఇప్పుడు స్పీడ్ తగ్గించింది. 

ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది వైష్ణవి. 

కెరీర్ బిగినింగ్ లో రీల్స్ , షార్ట్ ఫిలిమ్స్ చేసి పాపులర్ అయ్యింది. ఈ బ్యూటీ షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అయ్యేవి. 

ఆతర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా ఈ అమ్మడికి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఇక హీరోయిన్ గా చేసిన మొదటి సినిమా బేబీ సూపర్ హిట్ అవ్వడంతో వైష్ణవి పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది. దాంతో వరుసగా ఆఫర్స్ అందుకుంది.

ఆతర్వాత చేసిన లవ్ మీ, జాక్ సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో చిన్న గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఎపిక్ అనే సినిమా చేస్తుంది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వైష్ణవి తన అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది. తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫోటోలు పంచుకుంది.