సినిమాలకు గ్యాప్ ఇచ్చిన నివేదా థామస్.. ఏడాదిగా నో మూవీ

11 July  2026

Pic credit - Instagram

Rajeev 

నివేదా థామస్.. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది ఈ వయ్యారి భామ. తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది నివేదా థామస్. 

ఈ అమ్మడు ఎక్కువగా మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. తెలుగులో జెంటిల్ మేన్ సినిమాతో పరిచయమైంది. 

మలయాళ చిత్రం వెరుథె ఒరు భార్య సినిమాలోని ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల తోపాటు  కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి పురస్కారం అందుకుంది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన నివేదా థామస్.. ఆతర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆకట్టుకుంది. 

నిన్ను కోరి, జై లవ కుశ, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, 118,బ్రోచేవారెవరురా, వి, వకీల్‌ సాబ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది 

2024లో 35 చిన్న కథ కాదు సినిమాతో మంచి అందుకుంది ఈ అమ్మడు. ఈ సినిమాకు గాను గద్దర్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నివేదా థామస్. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.