No Smoking Day 2021 : ప్రతి ఏడాది మార్చి రెండో బుధవారం నో స్మోకింగ్ డే.. ఈరోజు ఎందుకు జరుపుకుంటామంటే..!

ఈ రోజు నేషనల్ నో స్మోకింగ్ డే.. ధూమపానం వలన కలిగే నష్టాలను వివరిస్తూ.. ఆరోగ్య అవగాహాన దినోత్సవంగా జరుపుకుంటాం.. ఈ రోజు ధూమపానం మానేయాలని కునే వారితో పాటు స్మోకింగ్ చేసేవారికి అవగాహన కలిపిస్తూ.. సాయం చేయడానికి..

No Smoking Day 2021 : ప్రతి ఏడాది మార్చి రెండో బుధవారం నో స్మోకింగ్ డే.. ఈరోజు ఎందుకు జరుపుకుంటామంటే..!
Follow us
Surya Kala

|

Updated on: Mar 10, 2021 | 11:14 AM

No Smoking Day : ఈ రోజు నేషనల్ నో స్మోకింగ్ డే.. ధూమపానం వలన కలిగే నష్టాలను వివరిస్తూ.. ఆరోగ్య అవగాహాన దినోత్సవంగా జరుపుకుంటాం.. ఈ రోజు ధూమపానం మానేయాలని కునే వారితో పాటు స్మోకింగ్ చేసేవారికి అవగాహన కలిపిస్తూ.. సాయం చేయడానికి ఈరోజు ఉద్దేశించబడింది.

అయితే ఈ నొస్మోకింగ్ డే ప్రతి ఏడాది ఒకే రోజు రాదు.. మార్చి లో రెండో బుధవారం ను నో స్మోకింగ్ డేగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 10 న నో స్మోకింగ్ డే వచ్చింది. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం సిగరెట్ , పొగాకు వల్ల శరీరానికి కలిగే హానిని తెలియజేయడం.. ఆరోగ్య ప్రభావాల గురించి అవగాహన కల్పించడం. మొట్టమొదటి నో స్మోకింగ్ డేను 1984 లో జరిపారు.  ఇక ధూమపానం వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ.. ప్రతి ఏడాది ఒక థీమ్ ని చిన్న పదబంధం రూపంలో ప్రచారం చేస్తారు.

ధూమపానం చేసే వారి ఊపిరితిత్తులతో పాటు శరీరమంతా ప్రభావితం చేస్తుంది. ఒకొక్కసారి క్యాన్సర్ కారకంగా కూడా మారుతుంది. పొగాకు తినడం, తాగడం మానేయాలని ప్రోత్సహిస్తారు.. అంతేకాదు ఈరోజు ఒక్కరోజైనా స్మోకింగ్ చేయవద్దని సూచిస్తారు.

గత కొన్ని దశాబ్దాల క్రితమే స్మోకింగ్ చాలా ప్రమాదకరమని స్పష్టంగా తెలిసింది. ఇక మన దేశంలోనే కాదు.. అనేక దేశాల్లో ధూమపానం చేసేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. సిగరెట్, పొగాకు తాగడం వల్ల కలిగే దుష్ఫలితాలను తెలియజేస్తూ.. పొగాకు రహిత జీవితాన్ని గడిపేలా ప్రజలను ప్రేరేపించడం ముఖ్యం ధూమపానం అలవాటు ఉన్నవారు అనేక వ్యాధులకు గురవుతారు. దగ్గు, శ్వాసకోస ఇబ్బందులు, దంతాలకు సంబంధించిన వ్యాధులతో పాటు.. ఎక్కువ కాలం స్మోకింగ్ చేసే వారికీ కాలక్రమంలో గుండె జబ్బులు, బ్రోన్కైటిస్, న్యుమోనియా, స్ట్రోక్ మరియు అనేక రకాల క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా నోటి క్యాన్సర్ కు కారకం అవుతుంది.

Also Read:

: నాన్న టిఫిన్ సెంటర్ తో కొత్త జర్నీని స్టార్ట్ చేయాలనుకుంటున్న దీప.. మరి కార్తీక్ నిర్ణయం ఏమిటంటే..!

రాజీనామాలు చేస్తేనే కేంద్రం దిగొస్తుందని పలు సందర్భాల్లో వైఎస్ జగనే చెప్పారు : గంటా శ్రీనివాసరావు