Karthika Deepam : నాన్న టిఫిన్ సెంటర్ తో కొత్త జర్నీని స్టార్ట్ చేయాలనుకుంటున్న దీప.. మరి కార్తీక్ నిర్ణయం ఏమిటంటే..!

కార్తీక్ ని కారు తియ్యమని ఆనందరావు కంగారు పెడుతుంటే.. సౌందర్య అపుడు చెబుతుంది. దీప ఇంట్లో లేదని.. పిల్లలని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయిందని.. కార్తీక్ షాక్ కి గురవుతాడు.. అయితే ఆనందరావు ఎమోషనల్ గా...

Karthika Deepam : నాన్న టిఫిన్ సెంటర్ తో కొత్త జర్నీని స్టార్ట్ చేయాలనుకుంటున్న దీప.. మరి కార్తీక్ నిర్ణయం ఏమిటంటే..!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Mar 10, 2021 | 12:29 PM

Karthika Deepam Serial :  తెలుగు వారి లోగిళ్ళలో ప్రతి రోజు సాయంత్రం 7.30 అయ్యిందంటే చాలు టీవీ వైపే అందరి దృష్టి.. అంతగా ఆకట్టుకుంటుంది కార్తీక దీపం.  వరదల సమయంలో కూడా ఆ నీటిలో కార్తీక దీపం చూశారంటే అర్ధం చేసుకోవాలి.. తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతగా కార్తీక దీపాన్ని ఆదరిస్తున్నారు. ఈరోజు 982 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయ్యింది. మరి ఈరోజు జరిగే హైలెట్స్ ను తెలుసుకుందాం..!

కార్తీక్ ని కారు తియ్యమని ఆనందరావు కంగారు పెడుతుంటే.. సౌందర్య అపుడు చెబుతుంది. దీప ఇంట్లో లేదని.. పిల్లలని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయిందని.. కార్తీక్ షాక్ కి గురవుతాడు.. అయితే ఆనందరావు ఎమోషనల్ గా ఇక కారు తియ్యక్కర్లేదు పెద్దోడా దీప పిల్లలు లేరట అని కన్నీరు పెడతాడు.. దీపకు ఆత్మాభిమానం అడ్డొచ్చిందా.. మామయ్య ఇది మా ఇల్లు మాకు హక్కు ఉంది.. నేను నా పిల్లలు ఇక్కడే ఉంటాం అని అంటే కాదంటామా అని అంటుంటుంటే.. సౌందర్య, ఆదిత్య, అడ్డుపడతారు.. కూల్ అవ్వమని ఓదారుస్తారు. మరోవైపు కార్తీక్ బాధగా మెట్లమీద కూర్చుండి పోతాడు.. సౌందర్య ఆవేశంగా కార్తీక్ వైపు వెళ్తూనే.. ఇప్పుడు ఎం అనొద్దు మమ్మీ.. షాక్ లో ఉన్నాడని ఆదిత్య అవుతాడు. అంతేకాదు అన్నయ్య రీలీజ్ అయ్యి వదినపిల్లల్ని వెదికే వరకూ నువ్వు ఏమి చెయ్యకు.. ఎదుకంటే నువ్వు వారిని వెదికించి తీసుకొచ్చినా ఏ శ్రీరామ్ నగర్ బస్తీలొనే కదా ఉండాలి అంటాడు. అందుకే అన్నయ్యలో మార్పు రావాలి అని సూచిస్తాడు.

మరోవైపు దీప తన బతుకు బండిని నడపడానికి పిల్లలని పోషించడానికి టిఫిన్ బండిని పెట్టాలని అనుకుంటుంది. వారణాసి ఓ బండిని తీసుకొస్తాడు.. ఇంతలో హిమ, శౌర్య అక్కడకు వచ్చి ఏమిటమ్మా ఇది అని అడుగుతారు. మిమ్మల్ని పోషించుకోవాలి కదా.. అందుకనే వంటలక్క పేరుని సార్ధకం చేసుకుందామని అని చెబుతుంది. అయితే శౌర్య కి గతం గుర్తుకొచ్చి.. ఇలాంటి బండి నానమ్మకి ఇష్టం ఉండదు కదా అని ప్రశ్నిస్తుంది. అపుడు దీప మరి మీ నానమ్మకి మిమ్మల్ని పస్తులు పెట్టడం కూడా ఇష్టం ఉండదు కదా అని చెబుతుంది. అంతేకాదు హిమ ప్రశ్నకు బదులుగా ఆత్మాభిమానం అమ్ముకోవడం కంటే ఇడ్లీలు చేసి అమ్మడం బెటర్ అంటూ లోపలి వెళ్తుంది. అయితే టిఫిన్ సెండర్ కు పేరుని శౌర్య సూచిస్తుంది. నాన్న సెంటర్ అని పేరు పెడదామని అంటుంది. దీప బాధగా మీరు మీ నాన్నని మరచిపోవడం జరగదు. అలా మార్చిపోమన్ని చెప్పే హక్కుకూడా లేదు.. మీవి పసిమనసులు అవి గాయపడితే తట్టుకోలేరు అంటూ కన్నీరు పెడుతూ.. అక్కడ నుంచి ఇంట్లోకి వెళ్తుంది.. అప్పుడు హిమ కోపంగా శౌర్యవైపు చూసి నాన్నని ఎందుకు గుర్తు చేశావు అమ్మని చూడు ఎలా బాధపడుతుందో అని మందలిస్తుంది. అపుడు వారణాసి.. మీ అమ్మ మీ నాన్నని మరచిపోతే కదా గుర్తు చేయడానికి అంటాడు.

ఇంతలో కార్తీక్ దీప ఇంటికి వచ్చి.. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు.. ఇంతలో సరోజినీ వస్తుంది.. అపుడు కార్తీక్ సరోజినీ తో దీప ఎక్కడికి వెళ్లిందో చెప్పలేదా నిజంగా చెప్పలేదా అని ప్రశ్నిస్తాడు. అపుడు సరోజినీ దీప ఇల్లుమాత్రమే ఖాళీ చేసి పోలేదు మీ జీవితం నుంచే ఖాళీ చేసి వెళ్ళిందని అంటుంది.. దీప ఉన్నప్పుడు ఈ ఇల్లు కళకాళాడుతూ ఉండేది. మీరు ఎప్పుడైనా ఏమైనా అంటే కన్నీరు పెడుతూ ఉండేది.. తన బాధను నాతో చెప్పుకునేది.. అయితే ఈ సారి కన్నీరు పెట్టలేదు.. బాధను బయటకు చెప్పుకోలేదు.. సామాన్లు సర్దుకుంది. ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. నిజంగా నీకు దీప ఎవరికీ చెప్పలేదా బాధగా కార్తీక్ అడుగుతాడు.. మీ అమ్మగారికి చెప్పలేదట.. సౌందర్యమ్మ వచ్చి కన్నీరు పెట్టుకుని వెళ్లారు. ఇక నాకు మాత్రం ఎం చెబుతుంది దీప అంటుంది సరోజినీ.

హిమ శౌర్యకు నాన్నకావాలి అని అడగలేదా.. అని అంటే.. శౌర్య ఇప్పుడు ఏమిటి.. చిన్నప్పటి నుంచి నాన్నకావాలి.. నాన్నదగ్గరకి వెళ్దాం అని అంటూనే ఉంది. అని కార్తీక్ ప్రవర్తనని ఎత్తి చూపిస్తుంది సరోజినీ.. నిజాన్ని అబద్ధంగా భావించి మోనిత మాయలో ఉన్న కార్తీక్ కి ఎప్పుడు కనువిప్పుకలుగుతుంది… సౌందర్య కుటుంబం ఆశిస్తున్నట్లు దీపని పిల్లలని వెతుకుతూ కార్తీక్ వెళతాడా .. చూడాల్సిందే మరి !

Also Read: ‘శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ ఉడిపి రామచంద్రరావుకు అరుదైన గౌరవం ఇచ్చిన గూగుల్..

పురపోరుకు సర్వసిద్ధం.. ఏపీలో ప్రారంభమైన పోలింగ్.. బారులు తీరిన ఓటర్లు

కేజీఎఫ్ స్టార్ యష్ తల్లిదండ్రులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వివాదం.. అసలు కారణం ఇదే.!