AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆచార్య’ సెట్ నుంచి వెనుదిరిగిన మెగాస్టార్ చిరంజీవి.. షూటింగ్‏కు మధ్యలోనే బ్రేక్ చెప్పేసిన చిత్రయూనిట్..

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వారం రోజులు నిర్వహించాల్సిన

'ఆచార్య' సెట్ నుంచి వెనుదిరిగిన మెగాస్టార్ చిరంజీవి.. షూటింగ్‏కు మధ్యలోనే బ్రేక్ చెప్పేసిన చిత్రయూనిట్..
Rajitha Chanti
|

Updated on: Mar 10, 2021 | 11:33 AM

Share

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వారం రోజులు నిర్వహించాల్సిన ఈ మూవీ షూటింగ్‏కు మధ్యలోనే బ్రేక్ చెప్పేసింది చిత్రయూనిట్. అత్యధిక ఉష్ణోగ్రతల వలన చిరుకు డీహైడ్రెషన్ జరిగినట్లుగా సమాచారం. దీంతో షూటింగ్ మధ్యలోనే చిరంజీవి హైదరాబాద్ వచ్చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. దీంతో షూటింగ్ మధ్యలోనే ఆపేసినట్లుగా సమాచారం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు బొగ్గు గనుల్లో చిరుకు సంబంధించిన కొన్ని సీన్లను చిత్రీకరిస్తున్నారు. అక్కడ మార్చి 15 వరకు షూటింగ్ జరగాల్సి ఉన్నా కేవలం మూడు రోజుల్లోనే షూటింగ్ నుంచి చిరు హైదరాబాద్ వచ్చేశారట. అక్కడ చిరంజీవితోపాటు రామ్ చరణ్ కూడా చిత్రీకరణలో పాల్గోంటున్నాడు. ఇదిలా ఉండగా… ఆచార్య టీంకు సమ్మర్ సెగలు తాకాయి. వేసవి కాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలను భారీగా నమోదవుతున్నాయి. ఇక అక్కడి బొగ్గు గనుల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని… అధిక వేడి కారణంగా చిరు స్వల్ప అస్వస్థతకు గురయినట్లుగా సమాచారం. దీంతో  షూటింగ్‏కు బ్రేక్ చెప్పి.. హైదరాబాద్ వెళ్ళారట చిరంజీవి. ఈకారణంగానే సినిమా చిత్రీకరణ నిలిచిపోయిందని టాక్. ఇదిలా ఉండగా.. మరో ప్రచారం కూడా జరుగుతుంది. ఈ సినిమాలో బొగ్గు గనుల్లో చిరంజీవికి సంబంధించిన సీన్లు చిత్రీకరించడం పూర్తైందని.. అందుకోసమే అక్కడి నుంచి చిరు వెళ్ళిపోయారని సమాచారం. ఈ సినిమాలో చిరుకు జోడీగా హీరోయిన్ గా కాజల్ నటిస్తుంది. ఇందులో రామ్ చరణ్, పూజాహెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విలన్ పాత్రలో రియల్ హీరో సోనూసూద్ నటిస్తుండగా.. మరో ప్రతినాయకుడిగా బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా నటిస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమా మే 13న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read:

శృతిమించిన అభిమానం.. వేదికపై బన్నీని చుట్టుముట్టిన ఫ్యాన్స్.. అసహనానికి గురైన స్టైలీష్ స్టార్..

Prashanth Neel : వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోలను లైన్ లో పెడుతున్న కేజీఎఫ్ డైరెక్టర్.. ఇప్పుడు ఆ హీరోతో కూడా..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!