రూల్స్ అతిక్రమించామా ? లేదే ! రాజ్యసభ డిప్యూటీ చైర్మన్

రూల్స్ అతిక్రమించామా ? లేదే ! రాజ్యసభ డిప్యూటీ చైర్మన్

రైతు బిల్లులపై రాజ్యసభలో ఓటింగ్ సందర్భంగా నిబంధనల అతిక్రమణ జరిగిందంటూ మీడియాలో వచ్చిన వార్తలను సభ డిప్యూటీ చైర్మన్  హరివంశ్ సింగ్ ఖండించారు. ఈ నెల 20 న సభలో జరిగిన వాస్తవాలను, వీడియోను...

Umakanth Rao

| Edited By: Anil kumar poka

Sep 28, 2020 | 1:31 PM

రైతు బిల్లులపై రాజ్యసభలో ఓటింగ్ సందర్భంగా నిబంధనల అతిక్రమణ జరిగిందంటూ మీడియాలో వచ్చిన వార్తలను సభ డిప్యూటీ చైర్మన్  హరివంశ్ సింగ్ ఖండించారు. ఈ నెల 20 న సభలో జరిగిన వాస్తవాలను, వీడియోను మీ ముందు ఉచుతున్నామని అంటూ వాటిని మీడియాకు పంపారు. సీపీఎం సభ్యుడు రాగేష్, డీ ఎం కె ఎంపీ తిరుఛ్చి శివ, ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారని, కానీ మూజువాణీ ఓటుతో వీటిని సభ తిరస్కరించిందని ఆయన అన్నారు. ఈ సభ్యులు ఎలా వ్యవహరించారో వీడియోలో చూడండి అన్నారు. అసలు వీళ్ళు తమ సీట్లలో కూర్చున్నారా లేదా అన్నది గమనించాలన్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu