బ్యాంక్‌కు బురిడీ.. సీఎం మేనల్లుడి అరెస్ట్.. సంబంధం లేదన్న కమల్ నాథ్

పలు బ్యాంకుల నుంచి రుణాలు పొంది వాటిని దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పురిని ఈడీ అరెస్ట్ చేసింది. రతుల్ పురిపై రూ.354కోట్ల బ్యాంకు కుంభకోణం ఆరోపణలున్నాయి. మోసర్ బేర్ కంపెనీకి రతుల్ పురి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న సమయంలో.. బ్యాంకుల్లో లోన్లు తీసుకుని వాటిని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. అయితే రుతుల్ పురితో పాటు మోసర్ బేర్ సంస్థకు చెందిన మరో నలుగురు డైరెక్టర్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది. […]

బ్యాంక్‌కు బురిడీ.. సీఎం మేనల్లుడి అరెస్ట్.. సంబంధం లేదన్న కమల్ నాథ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 20, 2019 | 3:11 PM

పలు బ్యాంకుల నుంచి రుణాలు పొంది వాటిని దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పురిని ఈడీ అరెస్ట్ చేసింది. రతుల్ పురిపై రూ.354కోట్ల బ్యాంకు కుంభకోణం ఆరోపణలున్నాయి. మోసర్ బేర్ కంపెనీకి రతుల్ పురి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న సమయంలో.. బ్యాంకుల్లో లోన్లు తీసుకుని వాటిని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. అయితే రుతుల్ పురితో పాటు మోసర్ బేర్ సంస్థకు చెందిన మరో నలుగురు డైరెక్టర్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఆది, సోమవారాల్లో ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

కాగా, మోసర్ బేర్ అనేది డిజిటల్ డేటా స్టోరేజ్ రంగంలో సేవలు అందించింది. సీడీలు, డీవీడీలు, స్టోరేజ్ డివైజ్‌లపే ఈ కంపెనీ తయారుచేసేది. అయితే బ్యాంకుల కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో గతేడాది ఈ సంస్థ మూతపడింది. రతుల్ పురిపై అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణం ఆరోపణలు కూడా ఉన్నాయి. అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మైఖేల్ ముడుపులకు సంబంధించిన నగదు మోసర్ బేర్ సంస్థ ద్వారానే చేతులు మారిందని విచారణలో తేలింది. ఇదే కేసుకు సంబంధించి ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసింది. సోమవారం అతన్ని కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ.. విచారణకు హాజరుకాని కారణంగానే అదుపులోకి తీసుకున్నామని తెలిపింది.

మరోవైపు తన మేనల్లుడు రతుల్ పూరి అరెస్టు విషయంపై మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ స్పందించారు. అతని వ్యాపార లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రతుల్ అరెస్ట్‌పై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇన్విస్టిగేషన్ సంస్థలు తమ పని తాము నిజాయితీగా చేసుకోవచ్చని పేర్కొన్నారు.

మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? లివర్ డేంజర్‌లో..
మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? లివర్ డేంజర్‌లో..
బడి పిల్లల పుస్తకాల బరువు తగ్గనుందోచ్‌.. వచ్చే జూన్‌ నుంచే అమలు
బడి పిల్లల పుస్తకాల బరువు తగ్గనుందోచ్‌.. వచ్చే జూన్‌ నుంచే అమలు
క్రికెటర్‌తో సెల్ఫీ కోసం ఆరాటం.. కట్‌చేస్తే.. ఊహించని ప్రమాదం
క్రికెటర్‌తో సెల్ఫీ కోసం ఆరాటం.. కట్‌చేస్తే.. ఊహించని ప్రమాదం
పీరియడ్స్‌లో కడుపునొప్పి బాగా వస్తోందా.. ఇవే కారణాలు కావచ్చు!
పీరియడ్స్‌లో కడుపునొప్పి బాగా వస్తోందా.. ఇవే కారణాలు కావచ్చు!
ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. పోలీసులు మనోజ్‌కు ఏం చెప్పారంటే..?
ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. పోలీసులు మనోజ్‌కు ఏం చెప్పారంటే..?
రూ.200 నోట్లు రద్దు అవుతున్నాయా..? కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ!
రూ.200 నోట్లు రద్దు అవుతున్నాయా..? కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ!
ఎన్నో సమస్యలను తగ్గించే పచ్చి బఠానీలు.. ఎంతో ఆరోగ్యం!
ఎన్నో సమస్యలను తగ్గించే పచ్చి బఠానీలు.. ఎంతో ఆరోగ్యం!
పార్టీ మారిన MLAలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంలో BRS పిటిషన్స్
పార్టీ మారిన MLAలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంలో BRS పిటిషన్స్
9 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు.. 6 ఏళ్లుగా ఛాన్స్ కోసం ఎదురుచూపులు?
9 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు.. 6 ఏళ్లుగా ఛాన్స్ కోసం ఎదురుచూపులు?
CA ఫలితాల్లో సత్తాచాటిన చిత్తూరు కుర్రోడు.. ప్రిపరేషన్ టిప్స్ ఇవే
CA ఫలితాల్లో సత్తాచాటిన చిత్తూరు కుర్రోడు.. ప్రిపరేషన్ టిప్స్ ఇవే
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..
ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..