సొంత అభిప్రాయాలు సరికాదు.. విమాన ప్రమాదంపై పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి కీలక ప్రకటన!
గత నెల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై రాజ్యసభలో సోమవారం వాడీవేడీగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. ప్రమాద ఘటనపై నిబంధనల ప్రకారమే దర్యాప్తు జరుగుతోందన్నారు. దీనిపై విదేశీ మీడియాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

జూన్ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై సోమవారం రాజ్యసభలో వీడీవేడీగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఘటనపై కేంద్ర పౌరవిమానానయాన శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాద ఘటనపై ఇప్పటికి కేవలం ప్రాథమిక నివేదిక మాత్రమే వచ్చిందని.. దాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇన్వెస్ట్‌గేషన్ టీమ్ నుంచి తుది నివేదిక వచ్చన తర్వాత ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలుస్తాయని ఆయన చెప్పారు. అనవసరంగా ఈ ఘటనపై కొన్ని విదేశీ మీడియాలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని ఆయన రోపించారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తమ సొంత అభిప్రాయాలు చెప్పడం సరికాదని కేంద్రమంత్రి మండిపడ్డారు.
అంతే కాకుండా ప్రమాద ఘటనపై నిబంధనల ప్రకారమే దర్యాప్తు జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రొటోకాల్ ప్రకారమే దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. బ్లాక్‌బాక్స్ దెబ్బతిన్నా డేటాను రిట్రీవ్ చేసినట్టు ఆయన తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత స్వదేశంలో బ్లాక్‌బాక్స్‌ను తొలిసారిగా డీకోడ్ చేయగలిగామని కేంద్రమంత్రి వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరకుండా తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు.
"First time decoding of Black Box happened in India": Civil Aviation Minister Kinjarapu Rammohan Naidu on AI-171 crash probe
Read @ANI Story | https://t.co/ILER4PNbQd#AirIndia #AI171 #Parliament pic.twitter.com/A6NLjD2NCy
— ANI Digital (@ani_digital) July 21, 2025
అలాగే దేశంలోని ప్రసిద్ధ నగరాల్లోని విమానాశ్రయాల అభివృద్ధి, విస్తరణకు చర్యలు చేపట్టిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎయిర్‌పోర్టులలో సిబ్బంది కొరత లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 90 శాతం వరకు పోస్టులు భర్తీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




